అమరావతి, ఆంధ్రప్రభ : సిక్స్‌ప్యాక్.. ఇప్పుడు ఒక ఫ్యాషన్. ఈ ప్యాక్ కోసం యువత ప్రస్తుతం వెంపర్లాడుతోంది. సిక్స్‌ప్యాక్ అంటే ఒక ఆరోగ్య, స్టేటస్ సింబల్‌గా యువత భావి స్తోంది. ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించాలంటే సిక్స్‌ప్యాక్ ఉంటే ఈజీగా వర్క్‌అవుట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్న యువత జిమ్‌ల వెంట పరుగెడుతోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ షార్ట్‌కట్‌లో కండలు తిరిగిన శారీరక సౌష్టవాన్ని పొందాలన్న ఆత్రుతలో పక్కదారి పడుతున్నారు. గంటల తరబడి జిమ్‌ల్లోనే గడుపుతూ శారీరక సౌష్టవాన్ని పెంపొం దించుకునేందుకు రకరకాల కసరత్తులు చేస్తున్నారు. యువత ఆరాటాన్ని క్యాష్ చేసుకునేందుకు జిమ్ యాజమాన్యాలు, ట్రైనర్లు రంగంలోకి దిగి, వారిని కిల్లింగ్ స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తున్నారు. ప్రమాదకర, ప్రాణహాని ఉన్న ఉత్పేరకాలను తీసుకునేందుకు యువతను కొంతమంది జిమ్ ట్రైనర్లు, యాజమాన్యాలు ప్రొత్సహిస్తూ వారి నుంచి భారీగా సొమ్ము లు చేసుకుంటున్నారు.
గతంలో దేహదారుఢ్యాన్ని, కండలను పొందాలంటే గంటల తరబడి వ్యాయామశాలల్లో చాలా కొద్ది మంది మాత్రమే కసరత్తులు చేసేవారు. కొన్నికొన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ, ఇతర స్వచ ్చంధ సంస్థల, దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసిన వ్యాయామశాలలు ఉండేవి. అక్కడ శిక్షకులు యువతకు సక్రమమైన పద్ధతిలో తర్ఫీదు నిచ్చేవారు. ఆ తర్వాత క్రమంలో వ్యాయామాల్లో ఆధునీకత సంతరించుకోవడంతో అనేక మార్పులు చోటు చేసుకుని గ్రామ, గ్రామాన పట్టణాల్లో జిమ్‌లు వెరిశాయి. యువత కూ డా ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించి జిమ్‌ల బాట పట్టారు. దీనినే జిమ్ ట్రైనర్లు, కొన్ని యాజమాన్యాలు తమకు అనువుగా మార్చుకున్నాయి. గంటల తరబడి వ్యాయామం చేయాలన్నా, తక్కువ వ్యవధిలో కండలు కలిగిన సౌష్టవాన్ని పొందాలన్నా షార్ట్‌కట్‌లను యువతకు చూపిస్తున్నారు. శారీరక సౌష్టవం, దారుఢ్యం కోసం ప్రమాదకరమైన, హానికరమైన మెఫిన్ టెర్మిన్ సల్ఫేట్ లాంటి ఇంజెక్షన్లు, టాబ్లెట్లు, ప్రొటీన్ పౌడర్ పేరిట ఇతర ఉత్పేరకాలు కలిసిన పొడిని యువతకు అందిస్తూ వారి భవిష్యత్‌ను ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. రకర కాల కంపెనీలు, వివిధ రకాల పేర్లతో మార్కెట్‌లో ఈ స్టెరా యిడ్స్ లభ్యమవుతున్నాయి. వైద్యులు నిర్ధారించాల్సిన స్టెరా యిడ్ డోస్‌ను జిమ్ ట్రైనర్లే నిర్ధారిస్తూ విచ్చలవిడిగా ఇంజెక్షన్లు చేసేస్తున్నారు. ఫార్మసీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నేరుగా ఈ పౌడర్లు, స్టెరాయిడ్లను కొన్ని జిమ్ యాజమాన్యాలు, ట్రైనర్లు తెప్పించి వాటిని సిక్స్‌ప్యాక్ కోసం ఆరాటపడే యువత కు అందిస్తూ భారీగా సొమ్ములు గడిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈ కిల్లింగ్ స్టెరాయిడ్స్ దందా అనేక జిమ్‌ల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా 17 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న యువత ఈ ఉత్పేరకాలను సేవిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యాయామం చేస్తూ జిమ్‌ల్లోనే కుప్పకూలిపోతున్నారు. ఈ స్టెరాయిడ్స్ కూడా అధిక మొత్తం లో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు యువతను వెన్నాడుతున్నాయి. వాస్తవానికి ఈ స్టెరాయిడ్స్ తీసుకున్న యువత కొంత కాలానికి అనారోగ్యం పాలవుతున్నారు. తొలి నాళ్లలో ఈ స్టెరాయిడ్స్ మూలంగా ఉత్సాహంగా వ్యాయా మం చేస్తూ జిమ్‌ల్లోనే గడిపేసిన యువత ఆ తర్వాత తీవ్ర రుగ్మతల పాలవుతున్నారు. గుండెపోటు, గుండెదడ, జీర్ణకోశ, మధుమేహం, ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం కిడ్నీ, మానసిక సమస్యల పాలవు తున్నట్లుగా వైద్యులు పేర్కొం టున్నారు. స్టెరాయిడ్స్ తీసుకోవాలంటే డాక్టర్ల ప్రిస్కిప్ష్రన్, సలహాలు, సూచనలు తప్పనిసరిగా పొందాల్సి ఉండగా అటువంటిది ఏమీ జరక్కుండానే ఈ కిల్లింగ్ డ్రగ్స్ నేరుగా జిమ్‌లకు చేరు కుంటున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా స్టెరాయిడ్స్ లభ్య మవుతుండటంతో వినియోగం కూడా బాగా పెరిగింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రముఖుల నుంచి సాధారణ వ్యక్తుల వరకు జిమ్‌ల్లో వర్క్‌అవుట్లు చేస్తూ కుప్పకూలిన ఘట నలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినా కూడా ఔషధ నియంత్రణ శాఖ, పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ఈ దందాపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో జిమ్‌ల్లో ఈ దందా మూ డు ప్రొటీన్ పౌడర్లు, ఆరు స్టెరాయిడ్ ఇంజెక్షన్లుగా సాగుతోంది.
ముప్పు తప్పదు.. వైద్యులు..
స్టెరాయిడ్స్ వినియోగంతో ముప్పు తప్పదని వైద్య నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో ఈ ఉత్పేరకాలు హానీ చేయకపోయినా కొద్దికాలంలోనే దుష్ప్రరి మాణాలను చూపిస్తాయని హెచ్చరికలు చేస్తున్నారు. సిక్స్‌ప్యాక్ కోసం సాధారణ వ్యాయామాన్ని వదిలేసి స్టెరాయిడ్స్‌తో కండలు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాలు తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టెరాయిడ్స్ వినియోగం ఒక క్రమ పద్ధతిలో అవసరమైన పేషెంట్లకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఈ డోస్ కచ్ఛితంగా వైద్యుడు నిర్ధారిం చాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా ఇష్టానుసారంగా తీసుకోవడం ప్రాణాలకే ప్రమా దమని గుండె పోట్లు, దడ, న్యూరో సమస్యలు జీర్ణకోశ, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని మానసిక సమస్యలు కూడా బాధిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ హార్మోన్ల ప్రభావం వల్ల పెర్టిలిటీ సమస్యలు, లైంగిక సమ స్యలు తలెత్తుతాయని పేర్కొంటు న్నారు. డ్రై ప్రొటీన్ పౌడర్‌ను నేరుగా సేవించడం ప్రమాదకరమని నీళ్లలో లేదా పాలలో వినియోగిం చాలని సూచిస్తు న్నారు. అలా కాకుండా నేరుగా తీసుకుంటే ఆ సప్లిమెంట్స్‌లో ఉండే కొన్ని చెడు రసాయనాలు, ఇతర వ్యర్ధాలు శరీరంలో చేరి అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయని తెలుపుతున్నారు.