Thursday, November 21, 2024

కీవ్ మా ఆధీనంలోనే ఉంది : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

గ‌త మూడు రోజులుగా ర‌ష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ వ‌స్తోంది. బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. అయితే ఓ వైపు లెక్క‌లేన‌న్ని బాంబుల‌తో ర‌ష్యా దాడి చేస్తున్నా… చిన్న దేశ‌మైన‌ప్ప‌టికీ ఉక్రెయిన్ ధైర్యంగా ర‌ష్యా దాడుల‌కు ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రానికే ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను చుట్టుముట్టామ‌ని, ఏ క్ష‌ణంలో అయినా కీవ్‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకుంటామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. అయితే తాజాగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌ధాని కీవ్‌పై తాము ఇంకా ప‌ట్టు కోల్పోలేద‌ని, ఇప్ప‌టికీ కీవ్ త‌మ అధీనంలోనే ఉంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ స‌హా ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేదాకా వెన‌క్కు త‌గ్గ‌రాద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న సైన్యానికి పిలుపునిచ్చారు. పుతిన్ భావ‌న‌ను ఇట్టే ప‌సిగ‌ట్టిన జెలెన్‌స్కీ.. కీవ్‌లోకి ర‌ష్యా బ‌ల‌గాలు చొర‌బ‌డ‌కుండా వ్యూహం ర‌చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement