జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్ ఘటన మిస్టరీగా మారింది. రామకృష్ణయ్య కిడ్నాప్‌నకు గురై రెండ్రోజులు అవుతున్నా అతని ఆచూకీ దొరకలేదు. కిడ్నాప్ అయిన దగ్గర నుంచి కుటుంబ సభ్యులు ఎంతలా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమ్మీద వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
మరోవైపు పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. కిడ్నాపర్లు రామకృష్ణయ్యను హత్యచేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీంతో రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు.