కియా ఇండియా తన మిడ్ రేంజ్ SUV అయిన సెల్టోస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందించనున్నట్లు బుధవారం తెలిపింది. ఈ మోడల్స్‌లోని అన్ని వెహికల్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలనే నిర్ణయం.. భద్రతపై తమ ఇంపార్టెన్స్‌ని తెలియజేస్తోందని కంపెనీ తెలిపింది. కాగా, ఈ దక్షిణ కొరియా ఆటోమేకర్ ఇప్పటికే దాని అన్ని మోడల్ కారెన్స్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా అందిస్తోంది.
తమ ఉత్పత్తులను అప్‌డేట్ చేయడం, మార్కెట్ పరిశోధన.. ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అభిరుచి, డిమాండ్‌పై అవగాహన ఆధారంగా తమ ఉత్పత్తులను నిరంతర అప్‌డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ & మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కియాకు భారతదేశం కీలకమైన మార్కెట్‌గా ఉంది. అందులోనూ సెల్టోస్ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్‌గా ఉందని హర్దీప్సింగ్ తెలిపారు. దేశంలోని కంపెనీ మొత్తం అమ్మకాలలో సెల్టోస్ వాటా 60శాతానికి దగ్గరగా ఉందని తెలిపారు. అక్టోబరు 1 నుంచి ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కార్ల తయారీదారులు ఎనిమిది మంది వరకు ప్రయాణించే మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించాలని ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది.