ఈ మధ్యకాలంలో డైరెక్టర్లకి హీరోలు, నిర్మాతలు గిఫ్ట్ లు ఇవ్వడం కామన్ గా మారింది. కాగా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ , దర్శకుడు రమేష్ వర్మకి ఖరీదైన రేంజ్ రోవర్ కారుని బహుమతిగా ఇచ్చాడు. ఈ సినిమా థియేట్రికల్ .. నాన్-థియేట్రికల్ హక్కులకు రవితేజ కెరీర్ బెస్ట్ డీల్ కుదిరిందని ఇంతకుముందు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇంతలోనే దర్శకుడికి అదిరిపోయే బొనాంజ గిఫ్ట్ అందింది.
అయితే అతడికి ఏ ప్రాతిపదికన గిఫ్ట్ ఇచ్చారు అంటే.. కరోనా క్రైసిస్ కొనసాగుతున్నా సినిమాని సజావుగా పూర్తి చేసి రిలీజ్ ముందే బెస్ట్ డీల్ కుదుర్చుకోవడంలో అతడి పనితనానికి గుర్తింపుగా ఈ కానుకను ఇచ్చారని టాక్. నిర్మాత కోనేరు సత్యనారాయణ ఇప్పటికే భారీ లాభాల్లో ఉన్నారు. ఆయన క్రియేటర్లకు ఇచ్చే గౌరవం గుర్తింపు ఎంతో గొప్పది. ఇప్పుడు రమేష్ వర్మకు జాక్ పాట్ తగిలింది. దాదాపు రూ. 1.15 కోట్ల రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందుకున్నాడు ఆయన.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..