Friday, November 22, 2024

ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు ఎంతో తెలుసా?

ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా ఖైరతాబాద్‌లో భారీ వినాయకుడు కొలువు తీరనున్నాడు. ఈసారి ఏకాదశ రుద్ర మహా గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన గణేష్‌ విగ్రహాలలో ఖైరతాబాద్ గణేష్ విగ్ర‌హం ఒక‌టి. ప‌ది రోజుల పాటు కొన‌సాగే గ‌ణేష్ చ‌తుర్థి వేడుక‌ల్లో వేలాది మంది భ‌క్తులు ఖైర‌తాబాద్ గ‌ణేషుడిని ద‌ర్శించుకుంటారు. అయితే, గ‌తేడాది కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా విగ్ర‌హం ఎత్తు 9 అడుగుల‌కే ప‌రిమితం చేశారు. ఈ ఏడాది విగ్ర‌హం ఎత్తు పెంచుతూ 30 అడుగులుగా నిర్ధారించారు. 2021 అవ‌తారం ఏకాద‌శ రుద్ర మ‌హా గ‌ణ‌ప‌తి – ల‌క్ష్మీ దేవి, పార్వ‌తి దేవి దేవ‌త‌ల విగ్ర‌హాల‌తో కూడి ఉంటుంది. ఏకాదశ రుద్ర మహా గణపతిగా ముస్తాబై భక్తుల పూజలందుకోనున్నాడు.  సెప్టెంబర్‌ 10కల్లా గణపతిని పూజలకు సిద్ధం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కాగా, 2019లో వినాయకుడి విగ్రహం 61 అడుగులుగా ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement