ఉక్రెయిన్‌పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై దాడులు చేస్తూ.. స్వాధీనం దిశగా కదులుతున్నాయి రష్యా బలగాలు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పార్లమెంట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యాకు కానీ, రష్యా పౌరులకు గానీ ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతినిచ్చే చట్టాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. దీంతో రష్యాకు ఉక్రెయిన్ ఝలక్ ఇచ్చినట్లైంది. ఈ విషయంపై ఉక్రెయిన్ ఎంపీ లేసియా వాసిలింకో ట్వీట్ చేశారు.
అత్యావశ్యకమైన భద్రతా చట్టాలపై ఓటింగ్ కోసం పార్లమెంట్ సమావేశమైంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు తెగబడుతున్న నేపథ్యంలోనే అత్యవసరంగా సమావేశమయ్యాం. అని ఎంపలెసియా వాసిలెంకో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా విచక్షణారహితంగా దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో రష్యాను ఆర్థిక చట్రంలో బిగించాలని పలు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే పుతిన్ ఆగుతారని ఆ దేశాలు ఓ అంచనాకు వచ్చాయి. అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలను ప్రకటించాయి. దీని ద్వారా పుతిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది వారి ప్లాన్. ఈ దేశాలే కాకుండా స్విట్జర్‌లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి తటస్థ దేశాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.