ఒక ట్రావెల్ బ్లాగర్ కేరళ నగరాన్ని అన్వేషించడానికి.. పర్యాటకుల దృష్టిని తీసుకురావడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలను వీడియో రూపంలో పోస్ట్ చేయగా అది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. లారిస్సా డి’సా అనే మహిళ తెల్లటి రంగు చీరను ధరించి, తన జుట్టును చక్కగా బన్తో కట్టుకుంది. ఆమె సుందరమైన ప్రకృతి మధ్య రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. కేరళలోని ప్రశాంత వాతావరణాన్ని ఆమె ప్రదర్శించారు. ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేయగా లక్షల్లో వీక్షణలు వచ్చాయి. ఆమె ప్రయత్నాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఓ యువతి పట్టు చీర కట్టుకోవడం మాత్రమే కాదు..ఆ చీరతో స్కేటింగ్ చేసింది. అది కూడా ట్రెడిషన్ లో సారీని ధరించి..నెటిజన్స్ ని మెస్మరైజ్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement