రెంటుకు ఉంటున్న ఉంటున్న ఇంట్లో ఉన్న మగాళ్లు నలుగురు ఆ 18 ఏండ్ల బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ మృగాళ్ల విపరీత చర్యలతో వేగలేక ఆ బాలికి తనువు చాలించింది. అయితే రెండేళ్ల క్రితం ఆ బాలికను రేప్ చేశారన్న కారణంగా ఆరుగురు ఉన్న ఇంటి సభ్యుల్లో నలుగురిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదైంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని తెన్హిపాలెంలో వెలుగుచూసింది.
బంధువులచే పదే పదే లైంగిక వేధింపులకు గురైన 18 ఏళ్ల బాలిక.. కేరళలోని తేన్హిపాలెంలోని తన ఇంట్లో శవమై కనిపించింది. బాలిక తన కుటుంబంతో కలిసి ఏడాదిన్నరగా అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ బాలికపై ఆమె సన్నిహిత బంధువులు నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, రెండేళ్ల క్రితం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఆరుగురు నిందితుల్లో నలుగురిపై అభియోగాలు మోపారు పోలీసులు. ఈ కేసులో కోర్టు విచారణలు కూడా జరుగుతున్నాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లి తన తమ్ముడిని స్కూల్లో దింపేందుకు వెళ్లిన సమయంలో ఆ బాలిక సూసైడ్ చేసుకుంది. ఆమె తన గదికి లోపలి నుండి తాళం వేసి ఉండడంతో ఎన్నిసాలు పిలిచినా రెస్పాన్స్ రాలేదు. టిఫిన్ తినడానికి తల్లి పిలిచినా రాకపోవడంతో అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా తన కుమార్తె పైకప్పుకు వేలాడుతూ కనిపించిందని తల్లి తమకు చెప్పిందని పోలీసులు తెలిపారు.
పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బాలిక మానసిక క్షోభకు గురైందని కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితులు బాధితురాలి బంధువులు కావడంతో కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టు తెలిపారు. బాలిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..