ఈ నెల 30వ తారీఖు నుండి ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేసింది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు ఆ రాష్ట్ర సర్కార్ చర్యలు మొదలు పెట్టింది. ఈ రెండు రోజుల పాటు అత్యవసర సేవలను మాత్రమే అనుమంతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉదయం 7 గంటల నుండి, రాత్రి 9 గంటల వరకు నిత్యావసర సరుకుల దుకాణాలను తెరిచి ఉంచనున్నారు. అత్యవసర పనుల కోసం వెళ్లే వారిని అనుమతించనున్నారు.ప్రైవేట్ వాహనాలను అనుమతించరు. అత్యవసర పనుల పేరుతో ఇంటి నుండి బయటకు వచ్చే వారంతా అవసరమైన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసే వారంతా ఈ మేరకు అవసరమైన పత్రాలను చూపించాలి. హాటల్స్ లో పార్శిల్ మాత్రమే అనుమతిస్తారు, మెడికల్ స్టోర్సు, మీడియా సంస్థలు, టెలికం, ఇంటర్నెట్ సేవలకు అనుమతించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..