Friday, November 22, 2024

కేర‌ళ‌లో నోరో వైర‌స్ విజృంభ‌న‌.. అప్ర‌మ‌త్త‌మ‌యిన క‌ర్ణాట‌క‌..

ఓ ప‌క్క క‌రోనాతో అత‌లాకుత‌లం అవుతుంటే ..మ‌రోప‌క్క ప‌లు వైర‌స్ లతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు జ‌నం. కాగా కేర‌ళ‌లో నోరో వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో పొరుగు రాష్ట్రం కర్ణాట‌క అప్ర‌మ‌త్త‌మ‌యింది. సరిహద్దు జిల్లాలు దక్షిణ కన్నడ, కొడుగు, ఉడుపి, ఉత్తరకన్నడలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎటువంటి అలసత్వం వద్దని, అనుమానిత లక్షణాలుంటే వైద్య పరీక్షలు చేయించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నోరో వైరస్‌తో బాధపడుతున్న వారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం లక్షణాలు ఉన్నాయ‌ని వైద్య అధికారులు వెల్ల‌డించారు.

నీరు, ఆహారం ద్వారానే ఈ వైరస్‌ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. 2020 నుంచి కర్ణాటకలో హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. గతేడాది 49,925మంది హఠాన్మరణాలకు గురయ్యారని ఇందులో 28,680మంది గుండెపోటుతోనే మృతి చెందారని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.45-55ఏళ్లలోపువారిలోనూ, 18 ఏళ్లలోపు వారిలోనూ ఈ సమస్యలు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. దీనిపై లోతుగా పరిశీలన జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని నిపుణులకు సూచించినట్టు కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కే సుధాకర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement