Saturday, November 23, 2024

Kerala: నరబలి కేసు అప్​డేట్​.. మహిళల రొమ్ములు కట్​చేసి, డేడ్​బాడీని 56 ముక్కలు చేశారు!

కేరళలో జరిగిన నరబలి కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో హ్యూమన్​ ఆర్గాన్​​ ట్రాఫికింగ్​ (మానవ శరీర భాగాల అక్రమ రవాణా) జరిగిందా? అన్న ఆరోపణలను కేరళ పోలీసులు తోసిపుచ్చారు. మారుమూల గ్రామమైన తిరువల్లలో ఆచారంలో భాగంగా మహిళలను బలి ఇచ్చారని, ఇట్లా చేయడం వల్ల అపార సంపద దక్కుతుందని భావించారని పోలీసులు తెలిపారు. మహిళలను చంపేసి, వారిని ముక్కలు ముక్కలుగా నరికి, వండి.. దాన్ని తిన్నారని పోలీసులు వివరించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

కేరళలో జరిగిన నరబలి కేసులో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీధుల్లో లాటరీ టిక్కెట్లు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్న పద్మ, రోస్లిన్ అనే ఇద్దరు మహిళలను నరబలిలో భాగంగా హతమార్చారు. వారి ఆర్థిక సమస్యలను తీర్చి, జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఈ బలి చేసినట్టు నిందితులు పేర్కొన్నారు. కేరళలోని పథనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్‌లో ఒక ఇంటి పెరట్లో మృతదేహం అవశేషాలను పోలీసులు ఇవ్వాల (మంగళవారం) వెలికితీశారు. అయితే ఆ అవశేషాలు చనిపోయిన వ్యక్తి తరిగిన శరీర భాగాలేనని పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో మహిళలను దారుణంగా హింసించి చంపేశారని పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నరబలిలో భాగంగా నిందితులు ఒకరి రొమ్ములు నరికి, మరొకరి శరీరాన్ని 56 ముక్కలుగా నరికి చంపినట్టు తెలుస్తోంది.ఈ నేరం వెనుక అవయవ మార్పిడి మాఫియా ఉందన్న వార్తల్లో నిజం లేదని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. లాజికల్‌గా ఇట్లాంటి కేసుల్లో హ్యేమన్​ ట్రాఫికింగ్​ సాధ్యం కాదని, ఇది డబుల్ మర్డర్ కేసు మాత్రమేనన్నారు.

మా ఫోకస్ అంతా కేసు దర్యాప్తుపైనే పెట్టామని పోలీస్​ కమిషనర్​ తెలిపారు. అనేక కథనాలు ప్రచారంలో ఉన్నా వాటిని నమ్మడం లేదన్నారు.  కేసులో ప్రధాన నిందితుడు అనేక కథలు చెబుతున్నా.. వాటిని తాము పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. కేరళ మానవ బలి ఆరోపణ నిందితులైన దంపతులను భగవాల్ సింగ్ – సాంప్రదాయ మసాజ్ థెరపిస్ట్, డాక్టర్​అయిన అతని భార్య లైలాగా గుర్తించారు. ఇక మూడో నిందితుడు రషీద్ అలియాస్ ముహమ్మద్ షఫీగా తెలిపారు. కాగా, బాధితులను బలి కోసం వారి ఇంటికి తీసుకొచ్చారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement