Friday, November 22, 2024

ర్యాగింగ్​ కేసులో స్టూడెంట్స్​కి కేరళ హైకోర్టు డిఫరెంట్​ శిక్ష, అదేంటంటే..

ర్యాగింగ్ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులకు కేరళ హైకోర్టు పనిష్​మెంట్​ కింద డిఫరెంట్​గా శిక్ష విధించింది. రెండు వారాల పాటు కొల్లం జనరల్ హాస్పిటల్‌లో సామాజిక సేవ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తమపై ర్యాగింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ కొల్లంలోని టీకేఎం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎంఎస్ హరికృష్ణన్, ఎం సహల్ మహమ్మద్, అభిషేక్ అనంతరామన్, నభన్ అనీస్, అశ్విన్ మనోహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సామాజిక సేవ సంతృప్తికరంగా పూర్తయినట్లు రుజువు చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించిన తర్వాతే నిర్దోషిత్వం అమలులోకి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

ఆ తర్వాత పిటిషనర్లను మార్చి 21న కొల్లాం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఎదుట హాజరుకావాలని జస్టిస్ కె హరిపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సంప్రదింపులు జరిపి పిటిషనర్లకు సామాజిక సేవలను కేటాయించి, రెండు వారాల పాటు.. రోజుకు కనీసం ఎనిమిది గంటలపాటు సేవలు చేసేలాచూడాలన్నారు. నిందితులు కళాశాలలోని జూనియర్ విద్యార్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించారని సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హృత్విక్ సిఎస్ చెప్పారు. అందుకే హైకోర్టు ఈ శిక్ష విధించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement