Tuesday, November 26, 2024

సమాజానికే సిగ్గుచేటు.. పోర్న్​చూసి అన్నాచెల్లెలు ఆ పని, 13ఏళ్ల బాలికకు గర్భం–చివాట్లు పెట్టిన హైకోర్టు

కేరళ హైకోర్టుకు ఈమధ్య వచ్చిన ఓ కేసు యావత్​ సమాజాన్నే ఆలోచనలో పడేసింది. అందరికీ అందుబాటులో స్మార్ట్​ఫోన్​లు ఉండడం, ఇంటర్​నెట్​ లభ్యత, ఆన్​లైన్​లో పోర్న్​​ వీడియోలు చూడడం వంటి అంశాలు ఈ కేసును మరింత జఠిలంగా మార్చేస్తున్నాయి. అసలు కేసు ఎంటంటే.. మైనర్​ అయిన సోదరుడి ద్వారా 13 ఏళ్ల బాలికకు ప్రెగ్నెన్సీ వచ్చింది. రెండు నెలలుగా ఆ బాలికకు ఇన్​టైమ్​లో పీరియడ్స్​ రాకపోవడం, కడుపులో నొప్పి అంటూ ఏడవడంతో తల్లిదండ్రులు డాక్టర్​ దగ్గరికి తీసుకెళ్లగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు విపత్కర పరిస్థితుల్లో గర్భం తొలగించాలని, అందుకు హైకోర్టు అనుమతి కోరుతూ పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ కేసులోని సెన్సివిటీని అర్థం చేసుకున్న హైకోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యఖ్యలు చేసింది. రాష్ట్ర అధికారులు పాఠశాలల్లో బోధిస్తున్న లైంగిక విద్యను పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది. మైనర్ అయిన ఆమె సోదరుడి ద్వారా గర్భం దాల్చిన 13 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా అబార్షన్​ చేయడానికి అనుమతిస్తూ జస్టిస్ వి. జి. అరుణ్ చేసిన పరిశీలనలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

కేసుతో ఫైనల్​ డిసిషన్​కు ముందు జడ్జి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ‘‘చిన్న తనంలోనే బాలికలకు ప్రెగ్నెన్సీ రావడం.. బాలికల్లో పెరుగుతున్న ఈ విపరీత పోకడల గురించి నేను ఆందోళన వ్యక్తం చేయవలసి వచ్చింది. ఇందులో కనీసం కొన్ని సందర్భాల్లో దగ్గరి బంధువులు ఉంటారు. నా అభిప్రాయం ప్రకారం.. పాఠశాలల్లో బోధిస్తున్న లైంగిక విద్యపై అధికారులు పునఃపరిశీలించాల్సిన సమయం ఇది. ఇంటర్నెట్‌లో పోర్న్ సులభంగా లభ్యం కావడం వల్ల యువకులు, చిన్నపిల్లల మనస్సులను తప్పుదారి పట్టించవచ్చు. వారికి తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా యొక్క సురక్షితమైన ఉపయోగం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం చాలా అవసరం ”అని జస్టిస్​ అరుణ్​ అభిప్రాయపడ్డారు.

ఇదే విధమైన మరో కేసు విషయంలో కూడా సంబంధిత చట్టాలపై మెరుగైన అవగాహన కల్పించేందుకు హైకోర్టులోని వేరే న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నారని కోర్టు పేర్కొంది. లైంగిక ప్రవృత్తి యొక్క పర్యవసానాల గురించి చిన్న పిల్లలకు అవసరమైన అవగాహన కల్పించడంలో రాష్ట్ర విద్యా యంత్రాంగం పనితీరు చాలా ఘోరంగా ఉందని (ఇతర) న్యాయమూర్తి కూడా గుర్తించారు” అని జస్టిస్ అరుణ్ స్పష్టం చేశారు.

ఈ కేసులో బాధితురాలు అత్యాచారం నుండి బయటపడిందని, అయితే.. మైనర్ అయిన బాలిక ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తోందని కోర్టు పేర్కొంది. ఇకమీదట ఆలస్యం చేయడం అంటే.. ఆమె వేదనను పెంచుతుందని కూడా జడ్జి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అబార్షన్​ చేయడానికి కోర్టు అనుమతి ఇస్తోందన్నారు.

- Advertisement -

అయితే.. అట్లాగే ఒకవేళ డెలివరీ కనుక అయ్యి, శిశువు సజీవంగా ఉన్నట్లయితే.. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య చికిత్సను అందజేయాలి. పిటిషనర్ శిశువు యొక్క బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, రాష్ట్రం, దాని ఏజెన్సీలు పూర్తి బాధ్యత వహించాలి. శిశువు యొక్క ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సహేతుకంగా సాధ్యమయ్యే విధంగా వైద్య సహాయం, సౌకర్యాలను అందించాలి అని కోర్టు ఆదేశించింది.  ఇంత చిన్న వయస్సులో గర్భం ధరించడం వల్ల కలిగే శారీరక శ్రమ, మానసిక ప్రభావం.. తత్ఫలితంగా మానసిక ఒత్తిడి వైద్యపరంగా గర్భాన్ని తొలగించడానికి కోర్టును ఆశ్రయించడానికి కారణాలుగా తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement