Tuesday, November 26, 2024

కేర‌ళ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై రోజుకి 90వేలమంది అయ్య‌ప్ప‌ భ‌క్తుల‌కే ద‌ర్శ‌నం

రోజు ల‌క్ష‌మందికి పైగా అయ్య‌ప్ప భ‌క్తులు ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా శబరిమలకు అయ్యప్ప మాలధారులు పోటెత్తుతున్నారు. దాంతో భక్తులను నియంత్రించడం సిబ్బందికి, అధికారులకు కష్టమవుతోంది. భక్తుల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోజుకు 90 వేల మందికే దర్శనం కల్పించాలని తీర్మానించింది.

భక్తుల తాకిడి పెరిగిపోతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్, ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు వర్గాలు, ఉన్నతాధికారులతో సమావేశమై, పరిస్థితులను సమీక్షించారు. స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యపై పరిమితి విధించడమే కాకుండా, దర్శన వేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు దర్శనం కల్పించనున్నారు. వాహనాలకు పార్కింగ్ సదుపాయాలను పెంచాలని కూడా సీఎం విజయన్ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement