Friday, November 22, 2024

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మళ్లీ రగడ..

కేరళలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై చర్చ మొదలైంది. గడచిన మూడు నాలుగేళ్లలో జరిగిన పరిణామాలు సీపీఎంను వెంటాడుతున్నాయి. శబరిమల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, నష్ట నివారణ ప్రయత్నాల్లో ఉన్న అధికార నేతలు ఇప్పుడు తమ మనసు మార్చుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేరళ దేవాలయ వ్యవహారాల శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమల అయ్యప్ప దేవాలయంలో జరిగిన ఘటనలు దురదృష్టకరమైనవేనని, ప్రతిఒక్కరూ వాటిని చూసి బాధపడ్డారని  అంటున్నారు.

బిజెపి సైతం ఇప్పుడు అదే అంశాన్ని ప్రధానంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. హిందువు ఓటర్లను ఆకర్షించే పనిలో సిపిఎం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బిజెపి నాయకులు. ఈ అంశం తమకు వ్యతిరేకంగా మారకముందే సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు పినరాయి విజయన్. ఇదే సమయంలో సీపీఎం సైతం ఈ విషయాన్ని చాలా చిన్నదిగా చూపేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఈ విషయం సుప్రీంకోర్టులోని అత్యున్నత ధర్మాసనం ముందుకు వెళ్లిందని, ఏ భక్తుని నమ్మకాన్నీ తాము వమ్ము చేయబోమని, ఇదే సమయంలో రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని పినరయి విజయన్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతం తానేమీ వ్యాఖ్యానించబోనని, ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

అందరికి 4 సంవత్సరాల క్రితం జరిగిన ఈ వివాదం ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల కి ప్రధాన అంశగా మారింది మరి బిజెపి యంత్రాన్ని ఉపయోగించి అధికారంలోకి వస్తుందా లేదా వేచి చూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు వర్ణిస్తున్నారు చెబుతున్నారు చెబుతున్నారు శబరిమల ఆలయ ప్రవేశం లోకి

Advertisement

తాజా వార్తలు

Advertisement