Saturday, November 23, 2024

కేరళ నటిపై లైంగికదాడి కేసు.. దర్యాప్తు అధికారికి బెదిరింపులు.. దిలీప్ ఇళ్లు, ఆఫీసుపై రైడ్స్..

కేరళలో నటిపై లైంగిక దాడి, కిడ్నాప్ కు సంబంధించిన కేసు మరో మలుపు తిరిగింది. కేసు దర్యాప్తు ఆఫీసర్ ని నటుడు దిలీప్, అతని సోదరుడు బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. దిలీప్ కు సంబంధించిన ఆడియో క్లిప్ ఆధారంగా దర్యాప్తు అధికారి ఫిర్యుదుతో మరో కేసు నమోదైంది. కాగా ఈ రోజు దిలీప్, అతని సోదరుడి నివాసంతో పాటు వారి నిర్మాణ సంస్థ గ్రాండ్ ప్రొడక్షన్ కంపెనీ ఆపీసుపై కేరళ పోలీసు క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ దాడులు జరిపింది. 2017లో నమోదైన నటిపై లైంగిక దాడి కేసులో దిలీప్ కూడా నిందితుడు. అయితే ఇటీవల ఒక టీవీ చానెల్ లో కూడా ఈ మేరకు ఆడియో క్లిప్ లో మాట్లాడిన డిటెయిల్స్ ప్రసారం చేశారు. ఇందులో నటుడు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలిసింది.

నటిపై దాడి కేసులో దిలీప్‌పై ఇటీవల మీడియా ద్వారా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించిన దర్శకుడు బాలచంద్ర కుమార్.. క్రైమ్ బ్రాంచ్‌కు కొన్ని ఆధారాలు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. దర్యాప్తు అధికారులపై దాడికి కుట్రపై పలుమార్లు చర్చలు జరిగాయని కుమార్ పేర్కొన్నారు. శ్రీ కుమార్ నవంబర్ 25న కేరళలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దిలీప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, నిందితుడు నటుడు దిలీప్ ఇంట్లో కనిపించిన కీలక నిందితుడు పల్సర్ సున్నీకి తాను ప్రత్యక్ష సాక్షినని పేర్కొన్నాడు. కిడ్నాప్‌కు గురైన నటిపై లైంగిక వేధింపుల వీడియో రికార్డింగ్‌ను దిలీప్ ఇతరుల బృందంతో కలిసి చూశారని, అలాగే కీలక సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు సహా దిలీప్ ఇంట్లో రికార్డ్ చేసిన ఆడియో సంభాషణల సారాంశాలను కూడా దిలీప్ అందించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

అయితే, న్యూస్ ఛానెల్‌లలో చూపిన విజువల్స్ ప్రకారం.. వాటిని స్వాధీనం చేసుకునేందుకు రైడింగ్ బృందాలు దిలీప్ నివాసం, అతని కంపెనీ కార్యాలయం వెలుపల కొంత సమయం వేచి ఉండవలసి వచ్చింది. కొందరు అధికారులు దిలీప్ ఇంటి గేటు దూకి లోపలికి వెళ్లేందుకు హంగామా చేస్తున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ తర్వాత అతని సోదరి గేటు ఓపెన్ చేయడంతో ఇంట్లోకి వెళ్లినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొంత ఆలస్యం తర్వాత కంపెనీ కార్యాలయాన్ని కూడా అక్కడి సిబ్బంది తెరిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో 10 మంది నిందితులు ఉండగా, తొలుత ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత దిలీప్‌ను అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement