జాతీయ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది.. భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మార్పు చెందింది. ఈ మేరకు ఇవ్వాల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన తీర్మానంపై పెద్ద ఎత్తున చర్చంచారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం ఏకగ్రీవంగా పార్టీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సరిగ్గా 1.19 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీ మార్పుపై సంతకం చేశారు. ఇక తెలంగాణ నుంచి మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.
పార్టీ పేరు మారుస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేసిన వెంటనే తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ సంబురాలు చేశారు కార్యకర్తలు, బీఆర్ఎస్ జిందాబాద్, దేశ్‌కీ నేతా కేసీఆర్ అనే నినాదాలు మిన్నంటాయి. స్వీట్లు పంచుకుని సంబురాల్లో మునిగి తేలారు. డప్పు చప్పుళ్లు, మేళాలతో డ్యాన్సులు చేస్తూ సందడి వాతారణం నెలకొంది.