దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు. ఈ సందర్భంగా తెలుగు నేల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ను స్మరిస్తూ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్కు చెందిన చాలా మంది నేతలు ఎన్టీఆర్కు నివాళి అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో మాసిన గెడ్డంతో ఎన్టీఆర్ కూర్చుని ఉండగా… ఆయన ముందు కాస్తంత వంగొని ఆయనను అభిమానంతో చూస్తూ కేసీఆర్ నిలబడ్డారు. కేసీఆర్ యువకుడిగా ఉన్న సమయంలో తీసిన ఫొటో ఇది. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్ రెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ మీద ఈ ఫొటో కనిపించింది. నిజంగానే ఇది అత్యంత అరుదైన ఫొటోగానే చెప్పాలి.తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేతగా కొనసాగుతున్నా.. పూర్వాశ్రమంలో ఆయన టీడీపీ నేతేనన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే సినీ రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్… టీడీపీ పేరిట రాజకీయ రంగ ప్రవేశం చేసే నాటికి ముందే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా… టీడీపీలోనే ఆయనకు రాజకీయ నేతగా గుర్తింపు దక్కింది. టీడీపీ పేరిట పార్టీ పెట్టిన ఎన్టీఆర్ పిలుపునందుకుని పలు రంగాలకు చెందిన వారు ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్టీఆర్ అంటే అప్పటికే ఎనలేని అభిమానాన్ని పెంచుకున్నకేసీఆర్ కూడా టీడీపీలో చేరిపోయారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement