జాతీయ రాజకీయాలపై గళమెత్తిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు పొరుగు రాష్ట్ర ప్రజలనుంచి అఖండ ఆదరణ వెల్లువెత్తుతోంది. తెలంగాణ చుట్టూ ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు ఇదే పలు పొరుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి నిజాం స్టేట్‌లో ఉన్న పలు సరిహద్దు రాష్ట్రాల గ్రామీణ ప్రజలు ఎప్పటినుంచో తమను తెలంగాణలో కలపాలని నినదిస్తున్న నేపథ్యం అటుంచితే తాజాగా కేసీఆర్ ప్రధాని కావాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక, ఏపీలలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజాదరణ పెరుగుతోంది. ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించి, కీలక నేతగా ఎదగాలని, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు దిశగా అంకురార్పణ మొదలు కావాలని కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, భూముల ధరలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాజెక్టుల విస్తరణ, ఆయకట్టు స్థిరీకరణ, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధిని కళ్లార గమనించిన ప్రజలు తమకెందుకు ఇవన్నీ అందడంలేదని ఆదుర్ధాలో ఉన్నారు. తమతమ ప్రభుత్వాలను నిలదీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు బంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో తామెందుకు తెలంగాణ భూభాగంలో లేకపోయామని వాపోతున్నారు.
ఇక సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి స్వయంగా ప్రతినబూని అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. నిధులు, విధుల్లో మార్పులు వచ్చాయి. పల్లెలు పచ్చధనంతోపాటు, ఆర్ధికంగా నిలదొక్కుకుంటూ స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా పురోగమిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎకరం రూ. 30లక్షలకు తక్కువ లేకుండా ఉంది. అదే మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో బార్డర్ దాటితే రూ. నాలుగైదు లక్షలకే ఎకరం వ్యవసాయ భూమి దొరుకుతోంది. దీంతో సర్వత్రా సీఎం కేసీఆర్ పథకాలపై చర్చ జరుగుతోంది. గతంలో తమను తెలంగాణ భూభాగంలో విలీనం చేయాలని తీర్మానాలు చేసిన పొరుగు రాష్ట్రాల గ్రామ పంచాయతీలు ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని కోరుతున్నారు.
మహారాష్ట్ర, కర్నాటకలో…
మహారాష్ట్రలోని సమీప నాందేడ్ జిల్లా ప్రజలు తాజాగా కేసీఆర్ ప్రధాని నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంనుంచి విడిపోయి ఏపీలో విలీనమైన భద్రాచలం మండలంలోని ప్రజలు కూడా తెలంగాణ వైపే మొగ్గుచూపుతున్నారు. ములుగు జిల్లాకు అనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని బీజాపూర్ జిల్లా ప్రజలు కూడా తెలంగాణ వైపు ఆశక్తిగా చూస్తూ కేసీఆర్ ప్రధాని అయితే తమకూ తెలంగాణలో అమలవుతున్న పథకాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో మారుమూల జిల్లాల్లో విద్యుత్ కోతలు, రహదారుల నిర్మాణంలో లోపాలు, సురక్షిత తాగునీరందని పరిస్థితులను గుర్తించి, తెలంగాణతో పోల్చుకొని సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న పథకాలకు జై కొడుతున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భారీగా ప్రజలనుంచి కేసీఆర్‌కు మద్దతు పెరుగుతోంది. నాదేడ్‌లో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంలేదని ఈ జిల్లాలోని ప్రజలు గతంలో తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశాయి. వీరంతా గతంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేదంటే తమను తెలంగాణలో విలీనం చేయాలని కోరాయి. ఈ జిల్లాలోని నాగోన్, భోకర్, డెగ్లూర్, కిన్వత్, హాత్‌గాన్ వంటి గ్రామాల స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా అయితే కేసీఆర్ ప్రధాని కావాలి లేదంటే తమకూ తెలంగాణ వంటి పథకాలు అమలులోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
తాము మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నెలకు రూ. 600 మాత్రమే వృద్దుప్య పెన్షన్ పొందుతున్నామని, తెలంగాణలో ఇది రూ. 2016 గా ఉందని మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ధర్మాబాద్ తాలూకాలో గడచిన 40ఏళ్లుగా తీవ్ర కరువు తాండవిస్తోందని, సాగునీటి సదుపాయం లేకుండా పోయిందని ఆరోపిస్తూ ఈ తాలూకా తమను తెలంగాణలో విలీనం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ వెంటనే అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్ ఆయా ప్రాంతాలకు రూ. 40కోట్ల గ్రాంట్‌ను ప్రకటించింది. తక్షణమే రూ. 12కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి నిధులను విడుదల చేయాలేదని మరోసారి ఆయా ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రభుత్వ తీరుకు ఆకర్శితులవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అనుమతించి టిక్కెట్లు ఇస్తే టీఆర్‌ఎస్ తరపున బరిలో దిగుతామని ప్రతిపాదనలు పంపిస్తున్నారు. బివాండీ, షోలాపూర్, రాజారంలలో ఇటువంటి డిమాండ్లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఇలా 40 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పరిస్థితులతో మహారాష్ట్ర ఇబ్బందులు పడింది. ఇక ఏపీలో విలీనమైన తెలంగాణ ప్రాంత గ్రామాలు కూడా మళ్లి సీఎం కేసీఆర్‌కే తమ మద్దతు అంటూ ప్రకటిస్తున్నాయి. భాషాప్రయుకత్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్నాటక, మహారాష్ట్రలలో కలిసిన మరాఠా, కన్నడ మాట్లాడే ప్రజలు కూడా మూకుమ్మడిగా సీఎం కేసీఆర్
నాయకత్వంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కర్నాటక సరిహద్దులోని రాయచూర్ ప్రాంత ప్రజలు కూడా ఇదే నినాదాన్ని పునరుధ్ఘాటిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా మంగళవారంనాడు తమిళనాడు రైతు సంఘం నాయకులు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాతక్మంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పలు రాష్ట్రాలకు చెందిన రైతులు క్యూ కడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి సంబ్రమాశ్చర్యాలకు లోనవుతూ తెలంగాణ తీరును కీర్తిస్తున్నారు. 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన తమిళనాడు రైతు సంఘం నాయకులు తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందించారు. మా రాష్ట్రాల్లో యేండ్లకు యేండ్లు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు లను కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకొని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తామని రైతు సంఘం నాయకులు తెలిపారు.
తెలంగాణ పథకాలు…దేశమంతటా కావాలి…
తెలంగాణలో రైతు బంధు, రైతు భీమా, వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాల అమలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలు చేసే వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలుకు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గత నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించగా, మంగళవారంనాడు మరో 12 మంది తమిళనాడు రైతు సంఘాల నాయకులు సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూశాక వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మెడల్‌గా అభివర్ణించారు. కేవలం3 సంవత్సరలలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేయడమే కాదు వ్యవసాయానికి నీళ్లు అందిస్తున్నారు.. ఇది చాలా గొప్ప విషయం అని తమిళనాడు రైతులు పేర్కొన్నారు. రైతు బంధు, రైతు భీమా ,వంటి పథకాలు అత్యద్భుతం అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.
60 ఏళ్లయినా పూర్తి కాలేదు…
మా తమిళనాడులో అలియార్ అనే సాగునీటి ప్రాజెక్టును 60 సంవత్సరాల క్రితం అగ్రిమెంట్ చేశారు ఇప్పటికి పూర్తి కాలేదు. ఇది పూర్తి అయితే 4 లక్షల 25 ఎకరాలకు సాగు నీరు అందుతుంది కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు.నె#హు అయంలో అగ్రిమెంట్ చేసిన సాగునీటి ప్రాజెక్టు ఇప్పటికి పూర్తి కాలేదు. కాని తెలంగాణలో 3 సంవత్సరాలలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఇంత తక్కువ కాలంలో నిర్మాణం జరిగినప్పుడు తమిళనాడులో ఉన్న ప్రాజెక్ట్ 60 యేండ్లు అయిన ఎందుకు పూర్తి కాలేదో మా ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని రైతు నేతలు వివరించారు.
రైతు బంధు పథకం చాలా గొప్ప విషయం ,తెలంగాణ లో రైతు బంధు అనేది రైతులకు ఉపయోగం.సీఎం కేసీఆర్ గొప్ప పథకం ప్రారబించిన తరువాత మోడీ ఇదే పథకాన్ని కాపీ కొట్టారు. అదే పథకాన్ని పీఎం కిసాన్ సమ్మాన్ అని ఇస్తున్నారు. దీనితో సంవత్సరంలో రూ. 6 వేలు మాత్రమే ఇస్తున్నారు. కానీ రైతు బంధు పథకం డైరెక్ట్‌గా రైతుల అకౌంట్‌లోకి వేయడం గొప్పగా ఉంది. ఇటువంటిది దేశంలో ఎక్కడ లేదు.లితమిళనాడు సీఎం స్టాలిన్‌ను కోరుతాం. రైతు బంధు, రైతు భీమా వంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తాం అని పేర్కొన్నారు. రైతు భీమా ద్వారా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే రూ. 5 లక్షలు ఇవ్వడంద్వారా రైతు కుటుంబాలకి మేలు జరుగుతుంది. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయింపు చేయడంతో వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయుకత్‌గా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా అద్భుతం, కాళేశ్వరం
ప్రాజెక్ట్ తో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి అని అభిప్రాయపడ్డారు.
నీటిపారుదల ప్రాజెక్ట్‌ల రాకతో తెలంగాణలో సాగు విస్తీర్ణం చాలా పెరిగింది. తమిళనాడు ఇలాంటి ప్రాజెక్ట్‌లు లేవు. రైతు బంధు సమితిని ఏర్పాటు చేయడం, రైతులకు రైతు వేదికలు నిర్మించడం కూడా చాలా ఉపయోగంగా మారింది. రైతు బంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణము చేశారు అని నేతలు ప్రశంసలు కురిపించారు. మా తమిళనాడు రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రోజెక్టును ఉదాహరణ తీసుకొని మా రాష్ట్రంలో 60 యేండ్ల నుండి పెండింగ్‌లో ఉన్న అలియార్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని మా సీఎంను కోరుతాం అని వారు ఈ సందర్భంగా ప్రకటించారు.