Tuesday, November 5, 2024

వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన కెసిఆర్

ఖమ్మం/కరీంనగర్‌/ హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అకాల వర్షాలు, వడగళ్ల వానలకు దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ నేడు పరిశీలించ నున్నారు. దీనికోసం నేటి ఉద‌యం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్ట‌ర్ లో ఖమ్మం జిల్లా బోన‌క‌ల్ మండ‌లం రామాపురం గ్రామానికి బ‌యలుదేరి వెళ్లారు..కాగా ఇటీవలి కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానకు ఉమ్మడి కరీంనగర్‌, వరం గల్‌, ఖమ్మం జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభు త్వం పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశిం చింది. రైతులు నష్టపోకుండా తగిన పరిహారం అందిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ కూడా గురువారం వడగళ్ల వానకు భారీగా పంట నష్టపోయిన ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. నేడు సీఎం ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలంలోని ముష్టికుంట్ల, రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పాలకుర్తి, పరకాల, నర్సంపేట నియోజకవర్గాల్లో సీఎం పర్యటించనున్నారు. కరీంనగర్‌ జిల్లాలో లక్ష్మీపూర్‌ పంప్‌హౌజ్‌తోపాటు లక్ష్మీపూర్‌, చిప్పకుర్తిలలో సీఎం పర్యటిస్తారు. లక్ష్మీపూర్‌ గాయత్రీ పంప్‌హౌజ్‌ సమీపంలో హెలిప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు. మూడు జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం పంట నష్టం వివరాలతోపాటు రైతులకు అందజేసే సాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించే అవకాశం ఉంది.

సిఎం కు స్వాగతం పలికేందుకు రామాపురం వద్ద బిఆర్ ఎస్ నేతలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..


కెసిఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ..

- Advertisement -

ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేటకు బయలుదేరుతారు.
10.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
10.15 గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో సీఎం కేసీఆర్‌ బయలుదేరుతారు.
12.10 గంటలకు మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
12.55 గంటలకు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరుతారు.
1.55 గంటలకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.
3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement