Friday, November 22, 2024

నాడు రాజయ్య.. నేడు ఈటల.. అచ్చిరాని వైద్యారోగ్య శాఖ!

తెలంగాణలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎవరి అచ్చిరావడం లేదు. మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన వైద్యారోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కిందకు తెచ్చుకున్నారు. కేసీఆర్ సిఫార్సుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో … ఈటల శాఖ లేని మంత్రిగా మిగిలిపోయారు. ఆయన్ను ఇంకా కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేయలేదు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో తాటికొండ రాజయ్యను వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టారు. అయితే, అతి కొద్ది నెలల్లోనే ఆయన పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను కేబినెట్​ నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత ఆ శాఖను లక్ష్మారెడ్డికి అప్పగించారు. రెండోసారి టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ శాఖను ఈటెల రాజేందర్ కు అప్పగించారు సీఎం కేసీఆర్. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి ఏర్పడినప్పటి నుంచి ఈటెల, సీఎం కేసీఆర్ కు మధ్య కొంచం గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈటెలపై భూకబ్జా ఆరోపణలు రావడం, దీనిపై కేసీఆర్ విచారణకు ఆదేశించడం, కొన్ని గంటల వ్యవధి ఆయన పదవిని బదిలీ చేస్తూ ఉత్వర్వులు రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ పదవి అచ్చి రావడం లేదనే వాదానలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement