హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన హోర్డింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పటికే వారం రోజులుగా వివిధ రూపాలలో వడ్ల సేకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆదివారం ఢిల్లీలో భారీ నిరసన దీక్ష చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో వివిధ డిజైన్లతో కూడిన భారీ హోర్డింగ్స్‌లను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఒకే దేశం ఒకే ధాన్యం సేకరణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ పోస్టర్లు చర్చనీయంశంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను, ఇక్కడి రైతాంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలను సూటిగా ప్రశ్నించేలా ఈ హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి.