ఇది ఒక ప్రభుత్వాన్ని కూల్చి మరో ప్రభుత్వాన్ని తెచ్చే యాత్ర కాదు.. ఇది ఒక ముఖ్యమంత్రిని మార్చేందుకు చేపట్టిన యాత్ర కాదు. ఇది బీసీ, దళిత, గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర. తెలంగాణలో నిజాంను తలపిస్తున్న వారిని తొలగించేందుకు చేపట్టిన యాత్ర అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తుక్కుగూడలో ఇవ్వాల జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి నేను రావాల్సిన అవసరం లేదన్నారు. దానికి బండి సంజయ్ ఒక్కడు చాలు.. కానీ, తెలంగాణలో నయా నిజాంలా మారిన చంద్రశేఖరరావును మార్చాలా వద్దా అని ప్రశ్నించారు అమిత్ షా..
ఓట్ల కోసం బండి సంజయ్ పాదయాత్ర చేపట్టలేదు. తెలంగాణలో ఇప్పటికీ కూడా రజాకార్ల ఆధీనంలో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఎవరికైనా వచ్చాయా? అని సభికులను ప్రశ్నించారు. అమిత్‌షా.. ఇవన్నీ అమలు చేయలేదు కాబట్టే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు అమిత్‌షా.