భద్రాద్రి కొత్తగూడెం, ప్రభన్యూస్ బ్యూరో: విలక్షణ ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత చాటుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, బీఆర్‌ఎస్‌ను మట్టి కరిపిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకొని, జిల్లా రాజకీయాల్లో తన మార్క్ చాటేలా కేసీఆర్ ప్రయత్నా లను ముమ్మరం చేసినట్లు సమాచారం. పొంగులేటి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్, పొంగులేటి వర్గానికి చెక్ పెట్టేందుకు ఫాంహౌస్ వేదికగా గతవారం రోజులుగా ఊహకందని వ్యూహ రచన
చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రచించి, అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అటు కమ్యునిస్టులు, ఇటు తుమ్మల
ఉద్యమాలు, సంఘటిత పోరాటాల ద్వారా శ్రామికవర్గంలో తమదైన ముద్ర వేసుకున్న కమ్యూనిస్టు పార్టీలకు స్నేహహస్తమందించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన తెలంగాణతో పాటు, దేశీయంగా బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు కమ్యూనిస్టులతో కలిసి నడవాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. వారితో పొత్తును కొనసాగించడం ద్వారా మునుగోడు తరహా ప్రయోజనం ఉంటుందని, ఆయా పార్టీలకు సైతం మేలు జరుగుతుందని, తద్వారా అన్నివర్గాలకు చేరువ కావొచ్చని గులాబీ దళపతి భావిస్తున్నారు. అదేక్రమంలో జిల్లాలో అందరికీ సుపరిచితుడైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీలో కీలక పదవిని అప్పగించడంతో పాటు, జిల్లాలో పార్టీ సమన్వయ బాధ్యతలను ఆయన భుజాలపై మోపితే ఎలా ఉంటుందని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఆగస్టు మొదటి వారం నుంచే శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుండగా, జరుగుతున్న ప్రచారంతో తుమ్మల వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తుమ్మలకు పూర్వవైభవం.?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపాదడపా బయటకు వస్తున్నా, జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అంతగా స్పందించడం లేదు. ఈ క్రమంలోనే పొంగులేటి వంటి నేతలను ధీటుగా ఎదుర్కొనే సత్తా తుమ్మల సొంతమని భావిస్తున్న సీఎం కేసీఆర్, తుమ్మలకు మరోసారి అమాత్య యోగం కల్పించడం ద్వారా ఆయన సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కమ్యూనిస్టు పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, జిల్లాలో అన్నివర్గాల ప్రజలకు అభిమాన నేతగా తుమ్మలకున్న పలుకుబడిని ఈ దఫా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో బీఆర్‌ఎస్ నేతలను సమన్వయ పరచడంతో పాటు, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తుమ్మల భుజస్కంధాలపై మోపాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో జిల్లాను ఒంటిచేత్తో శాసించిన తుమ్మలపై సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో విశ్వాసముంచినట్లు తెలుస్తోండగా, మరోసారి క్రియాశీలకంగా వ్యహరించేలా తుమ్మలను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పొంగులేటి వర్గానికి చెక్ పెట్టడమే లక్ష్యం
మాజీ ఎంపీ పొంగులేటి చేస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్, పొంగులేటిని దీటుగా ఎదుర్కొనే సత్తా తుమ్మలకే ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధితో పాటు, పార్టీ బలోపేతానికి తుమ్మలకు కీలక బాధ్యతలను అప్పగించేందుకు సీఎం సంకల్పించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన పలువురు, పొంగులేటి ఏకపక్ష వైఖరితో బీఆర్‌ఎస్ పార్టీలోకి తిరిగి వస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఆ పార్టీ ఆశావహుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొంగులేటి వర్గీయులు పార్టీ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకోవడంపై కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ముఖ ్యమంత్రి కేసీఆర్, జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు, ఆ పార్టీ నేతల మధ్య అసంతృప్తిని అవకాశంగా మలుచుకొని, కాంగ్రెస్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తుమ్మలను అస్త్రంగా రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఏక్షణంలో ఏ మలుపు తిరగబోతున్నాయోనన్న చర్చ జోరుగా సాగుతోంది.సనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ యుద్ధం