Tuesday, November 26, 2024

వృద్ధిరేటులో తెలంగాణ టాప్‌.. సంక్షేమానికి ఢోకాలేద‌న్న‌ కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది. గతేడాది 8.8 శాతంగా ఉన్న ఆర్ధికవృద్ధిరేటు ఈ యేడాది ఏకాఎకిన 9.2 శాతంగా నమోదైంది. దీంతోపాటు తలసరి ఆదాయం కూడా అద్భుత పెరుగుదలను కనబర్చింది. ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణకు ఇది ఆర్ధిక బలోపేతమేనన్న వాస్తవాలు నిజమవుతున్నాయి. సొంత వనరుల రాబడిలో కూడా అప్రతిహత వృద్ధిరేటుతో దేశంలోనే తొలి స్థానంలో ఉండగా, అభివృద్ధి చెందినవిగా చెప్పుకుంటున్న రాష్ట్రాలేవీ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవు. 2014-15తో పోలిస్తే రాష్ట్ర స్వీయ వనరుల రాబడి 90 శాతంపైగా పెరిగింది. వార్షిక సగటు వృద్ధి 11.52 శాతంగా ఉంది.

ద్రవ్య బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం ప్రకారం 3 శాతం అప్పు జీఎస్‌డీపీ అంచనాలపైనే ఉంటుంది. దీంతో పెరిగిన వృద్ధిరేటు నేపథ్యంలో మరో రూ. 2వేల కోట్లు రుణం పొందే వెసులు బాటు రాష్ట్రానికి కలిగింది. విభజన తర్వాత తెలంగాణకు భవిష్యత్తు ఉండదనే వాదనను తెలంగాణ సర్కార్‌ వమ్ము చేసింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక వివాదాలు పరిష్కారం కాకపోయినా స్థిరమైన ఆర్ధిక, సామాజిక ధోరణులతో ముందుకు సాగుతూ రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేప ట్టింది. విద్యుత్‌ ఉత్పత్తికి, అవసరాలకు ఉన్న కొరతను తీర్చేందుకు సమ గ్రంగా నిధులను ఖర్చు చేస్తూనే ఆర్ధిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. పన్నుల జోలికి పోకుం డా విద్యుత్‌ నిర్వహణ, సేకరణపై అనేక వ్యూహాత్మక చర్యలను అవలంభించింది. దీంతో 2014 నాటికే వివిధ రంగాల్లో కోతలను అధిగమించింది. తద్వారా 2015 సెప్టెంబర్‌ నుంచి పరిశ్రమలకు, నిరంతర విద్యుత్‌, రైతాంగానికి ఏకకాలంలో 9గంటల విద్యుత్‌ను అందించి గొప్ప విజయం సాధించింది.

ఇక ఆర్ధిక సమన్వయంలో భాగంగా అర్ధవంతమైన ఉపాధిని పెంచేందుకు, తద్వారా ప్రజల హోదాను పెంచి వారి కొనుగోలు శక్తిని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంది. ఇందులో విజయం సాధించడంతో పేదరికాన్ని తగ్గించి, విద్య, వైద్యం, ఇతర సదుపాయాలను ఆధునీ కరించి ప్రజలకు చేరువ చేసింది. సామా జిక కోణంలోనూ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంది. టీఆర్‌ఎస్‌ రెండోసారి సర్కార్‌ కొలువుదీరడంతో పథకాలు, వాటికి నిధుల అవసరంపై ప్రభుత్వం అధ్యయనం ఆరంభించింది. రైతు రుణమాఫీకి రూ. 17,500కోట్లు, రైతు బంధుకు రూ. 15000కోట్లు, ఆసరా పించన్లకు రూ. 10వేల కోట్లు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లకు రూ. 30వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు రూ. 5వేల కోట్లు, ఆరోగ్య శ్రీ సేవలకు రూ. 1000 కోట్లు, సబ్సిడీ బియ్యానికి రూ. 3వేల కోట్లు అవసరం మేరకు సిద్దం చేస్తోంది. అయితే గడచిన రెండేళ్లుగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా పడిపోవడంతో కొత్త పథకాలు అమలు కొంత వాయిదా పడింది. పాత పథకాల కొన సాగింపుతోపాటు, ఎన్నికల్లో హామీ ఇచ్చి నట్లుగా పించన్లు రెండిం తలు, వయో పరిమితి 57 ఏళ్ల కు తగ్గించడంతో కొత్తగా అర్హత సాధించనున్న పించన్‌దార్లపై మే ధో మథనం మొద లైంది. ప్రస్తుత ఆర్ధిక ఏడాదికి ఇది కూడా ఇబ్బందేమీ లేదు. తాజాగా ఏయే రాబడి శాఖ ల్లో వృద్ధిరేటు నమోదవు తోం దనే అంశాన్ని సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా పరిశీలించారు.

కాగా భూముల విక్రయాలపై ప్రభుత్వం భారీగా ఆశలు పెట్టు కుంది. రాజీవ్‌ స్వగృహ ఇండ్లను రెండు మూడు రోజుల్లో విక్రయించేందుకు ఉత ్తర్వులు వెలువడ నున్నాయి. రానున్న నూతన ఆబ్కారీ విధా నం, ఇసుక పాలసీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రవా ణా పన్నుల వసూళ్లు, అంతరాష్ట్ర సర్వీసులపై కూడా కొంత కఠినంగా వ్యవహరించేందుకు అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement