Thursday, November 21, 2024

Telangana | రేపటి నుంచే కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు.. 9 జిల్లాల్లోని గర్భిణులకు పంపిణీకి రెడీ!

తెలంగాణ ప్ర‌భుత్వం చాలెంజింగ్‌గా తీసుకుని బాలింత‌లు, గ‌ర్భిణుల్లో పోషాకాహార లోపాన్ని లేకుండా చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. రాష్ట్రంలో గ‌ర్భిణులు, బాలింత‌లు న్యూట్రీష‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఇది చాలా బాధాక‌రం అని మంత్రి కేటీఆర్‌కు ఓ వ్య‌క్తి చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్‌.. మూడు నెలల్లో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌ని మాట ఇచ్చారు. కేటీఆర్ చెప్పిన ప్ర‌కారం.. తెలంగాణ వ్యాప్తంగా న్యూట్రిష‌న్ కిట్లు ఉచితంగా అందించేందుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేసింది. రూ. 50 కోట్లతో గర్బిణులకు ఉచితంగా ఈ కిట్లు అంద‌జేయ‌నున్నారు. తొలుత 9 జిల్లాల్లో పంపిణీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని తొలుత కామారెడ్డి నుంచి ఆరోగ్య‌ మంత్రి హ‌రీశ్‌రావు వర్చువల్ ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత ఆయా జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు కేసీఆర్ న్యూట్రీష‌న్ కిట్ల‌ను అంద‌జేయ‌నున్నారు. ఈ కిట్ల‌లో ప్ర‌ధానంగా .. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉండేలా చూశారు. పోషకాహారం ద్వారా వీటిని అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కో కిట్ కు రూ.1962 తో రూపొందించి, కిట్లను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది.

న్యూట్రీషన్ కిట్లలో ఉండేవి…

  1. కిలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్
  2. కిలో ఖర్జూర
  3. ఐరన్ సిరప్ 3 బాటిల్స్
  4. 500 గ్రాముల నెయ్యి
  5. ఆల్బెండజోల్ టాబ్లెట్
  6. కప్పు
  7. ప్లాస్టిక్ బాస్కెట్
YouTube video

ఇప్పటికే తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీ అయ్యేవారికి అందిస్తున్న కేసీఆర్​ కిట్..

Advertisement

తాజా వార్తలు

Advertisement