Friday, November 22, 2024

ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు కెసిఆర్ దూరం దూరం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: హైదరాబాద్‌లో 8వ తేదీన వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచ్చేస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాల్లో
ఈసారి కూడా సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండనున్ననారు.. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు.. కోవిడ్ సమయంలో ప్రొటోకాల్ ఉల్గంఘనకు పాల్పండింది నరేంద్రమోడీ నే అన్నారు.. ఆ సమయంలో హైదరాబాద్ సందర్శనకు వచ్చిన మోడీ ముఖ్యమంత్రికి అధికారికంగా ఆహ్వానం పంపలేదన్నారు.. ఇక విమానాశ్రయంలో మోడీని కేసీఆర్‌ రిసీవ్‌ చేసుకోవడానికి కానీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఇది అధికారిక కార్యక్రమం కావడంతో ప్రొటోకాల్‌ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ప్రధాని హోదాలో ఎవరున్నా స్థానిక ప్రభుత్వాధినేతగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ లాంటి వీవీఐపీలు రాష్ట్రానికి వచ్చిన సందర్భాల్లో సీఎం హోదాలో స్వాగతం పలకడం ఆన వాయితీ. కానీ రాజకీయంగా విభేదాలు తలెత్తిన నేప థ్యంలో ప్రధాని మోడీని కేసీఆర్‌ రిసీవ్‌ చేసుకోవడం లేదని సమాచారం అందింది. ప్రధానమంత్రి కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement