Friday, November 22, 2024

జనం గొంతుకై కడిగేద్దాం….కెసిఆర్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఒకప్పటి మాట. నా తెలంగాణది నిత్య పోరాటల బాణి అంటోంది ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ. తెలంగాణ ఉద్యమం ముగిసినా పోరాటం అయిపోలేదంటోంది. మరో పోరాటానికి పార్టీ శ్రేణు లను సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న వివక్షపై ప్రశ్నించబోతోంది. కమలనాథుల కేంద్ర ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై చిన్న చూపును చూపిస్తున్నదన్న విషయాన్ని ఎండగట్టాలని డిసైడ్‌ అయ్యింది. నిత్యం జనంతో ఉంటూ బీజేపీని నిలదీయ డంలో ప్రజా గొంతుకై కడిగేయాలని భావిస్తోంది. చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సహకరించా ల్సింది పోయి ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమైంది. తొమ్మిది ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించా రని ప్రజలకు వివరించబో తోంది. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు విషయంలో ధర్నాలు, ఆందోళనలు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ను చూపిస్తోందని జనం ముందు చూపించే ప్రయత్నం చేయనుంది. ఇందుకు సంబంధించి అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నేతలకు అంతర్గత సూచనలు అంది నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అప్పటి కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదు. ఇప్ప టికీ కాజీపేట్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కాలేదు. విభజన సమయంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా మన్న హామీ నెరవేరలేదు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసింది. హైదరాబాద్‌ సిటీ మీద వివక్ష చూపిస్తుంది… అంటూ ప్రతి ఒక్క అంశంలో మోడీ సర్కార్‌ను కడిగేయాలని నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి తెలంగాణకు వస్తున్నారో చెప్పి రావాలంటూ ప్రశ్నించాలని తెలిపింది. గల్లిd నుంచి ఢిల్లిd వరకు చిన్నా, పెద్ద లీడర్లు అన్న తేడా లేకుండా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని ప్రజలకు వివరించబోతోంది. లక్షకు పైగా కరపత్రాలను ఇంటింటికి పంచడమే కాకుండా బీజేపీ ద్రోహం చేస్తోందని చెప్పబోతుంది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి..? కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీని నిలదీస్తూ ప్రజలను తమవైపు ఉండేలా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్లాన్‌ చేసింది. ఇప్పటికే గులాబీ బాస్‌ పక్కా వ్యూహాలతో పకడ్బందీ స్కెచ్‌ను అమలు చేస్తున్నారు.

కేంద్ర నిధుల్లో కోత
దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపును చూపిస్తోందని ఇప్పటికే పలుసార్లు సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నిధుల విషయంలోనూ తెలంగాణకు ఎన్ని కోట్ల రూపాయలను ఇవ్వకుండా ఆపేశారో లెక్కలతో సహా జనం ముందు ఉంచబోతున్నారు. 9 ఏళ్ల పాలనలో కేంద్ర సాయం లేకున్నా తెలంగాణను బీఆర్‌ఎస్‌ పార్టీ అభివృద్ధి చేసిందని జనంకు వివరించేలా ప్రణాళికలను రూపొందించారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సిన రాబడిని ఇవ్వకుండా చూపించిన వివక్షను కూడా ప్రశ్నించాలని పార్టీ నేతలకు తెలిపారు. హైదరాబాద్‌కు భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం ఆదుకుంటామని హామీ ఇచ్చిందే తప్పా.. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అని ఇప్పటికే బీజేపీని కడిగేస్తున్నారు. ఇదే విషయాన్ని మరోసారి జనంకు గుర్తు చేయబోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా 1000 కోట్లు తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేశారని చెప్పే ప్రయత్నాన్ని గులాబీ లీడర్లు ముమ్మరం చేశారు. ఇక మెట్రో నిర్మాణానికి నిధులు ఇవ్వాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసినా.. పట్టించుకున్న పాపాన పోలేదంటూ భాగ్యనగరంలోని జనంకు స్పష్టం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలా ప్రతి విషయంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే.. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఓటు వేయాలని అడుగుతున్నారని ప్రజా గొంతుకలా ప్రశ్నించాలని అధినేత కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణలో అడుగుపెడితే మోడీ అయినా, కేంద్ర మంత్రులైనా సరే వదిలేది లేదు అన్నట్లుగా పోరాటం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

శాసనసభలో చేసిన తీర్మానాల అమలేది..?
అసెంబ్లిdలో తీర్మానాలు చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని దళిత వర్గానికి వివరించబోతోంది. దళితులకు అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం తమదేనని.. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణపై అసెంబ్లిd తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినా ఆమోదించలేదంటూ స్పష్టం చేయబోతోంది. అటు ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సైతం అసెంబ్లిd తీర్మాన కాఫీని కేంద్ర ప్రభుత్వానికి పంపించినా కావాలనే పెండింగ్‌లో పెట్టారని ప్రశ్నించబోతోంది. ఎస్టీ జాబితాలో కులాలను చేర్చే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చెప్పనున్నారు. రాష్ట్రంలో దళిత బంధుతో అండగా ఉంటున్నామని ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నం చేయబోతున్నారు. కేంద్రం అన్యాయం చేస్తున్నప్పుడు కమలానికి ఎందుకు ఓటు వేయాలని ప్రజల చేతనే ప్రశ్నించేలా అధినేత కేసీఆర్‌ వ్యూహాలను రెడీ చేశారు. వాటిని మరికొద్ది రోజుల్లో అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement