Friday, November 22, 2024

కెసిఆర్ దూకుడు… అయ‌న‌కు సాటెవ్వ‌రు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: కేసీఆర్‌ సమ్మోహన శక్తి, పట్టు-దల జాతీయ నేతలకు అవగతమైంది. ఓవైపు విపక్షనేతలే టార్గెట్‌ గా అధికార కేంద్రప్రభుత్వం వ్యూహాలు రూపొందిస్తుంటే, ఆత్మరక్షణలో పడ్డ విపక్షాలకు ఇపుడు కేసీఆర్‌ ఓ మోడల్‌ అయ్యారు. ఆయన పోరాట స్ఫూర్తే విపక్ష నేతల్లో కొత్త ఉత్సాహాన్ని భవిష్యత్తుపై ఆశను కలిగిస్తోంది. 2024 మనదే అని దేశంలో ఘంటాపథంగా చెప్పే నేత కేసీఆర్‌ మాత్రమే. ఈ క్రమంలో వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై నితీశ్‌ కీలక ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహాకూటమి ఏర్పాటు- కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా నితీష్‌ ప్రయత్నాలు చేస్తుండగా, ఓవైపు మహారాష్ట్రలో, మరోవైపు ఆంధ్రప్ర్రదేశ్‌ లో వేగంగా విస్తరిస్తున్న బిఆర్‌ఎస్‌ ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ లపై కూడా కన్నేసింది. జాతీయస్థాయిలో ఆప్‌ మోడల్‌ లో సొంతంగా బలపడడంతో పాటు- ప్రత్యేక వ్యూహంతో 2024 లక్ష్యంగా పక్కాగా దూసుకెళ్తున్నారు. ఆదినుండీ బిహార్‌ లో బిఆర్‌ఎస్‌ కు ప్రత్యేక వ్యూహం ఉంది. కేసీఆర్‌ వ్యూహాలకు, ఆచరణకు విస్తుపోతున్న జాతీయ నేతలు తాము రేసులో.. ఎక్కడ వెనుకబడిపోతామోనని కేసీఆర్‌ సహాయం కోరుతున్నారు.

మరోవైపు నితీష్‌ కాంగ్రెస్‌ తో సహా విపక్ష నేతలందరినీ కలుస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతను ఏవిధంగా పటిష్టం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. నితీష్‌ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో పర్యటించి శరద్‌ పవార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, డి.రాజా, సీతారాం ఏచూరి, అఖిలేష్‌ యాదవ్‌ లతో భేటీ- కాగా, ఇపుడు విపక్ష నేతలను ప్రధానంగా కేసీర్‌ మోడల్‌, ఆచరణ ఆకర్షిస్తున్నది. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ప్రధాని మోడీ, అమిత్‌ షాలను ఎదుర్కోవాలంటే గులాబీ దళపతి కేసీఆర్‌ లా వ్యూహాత్మక దూకుడు కొనసాగించాలన్న చర్చ జాతీయ స్థాయిలో జరుగుతున్నది.

ఇప్పటికే ఖమ్మం సభ లో నలుగురు సీఎంలు పాల్గొని నవ చరితకు నాంది పలకగా, త్వరలో ప్రారంభం కానున్న తెలంగాణ సచివాలయానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ హాజరయ్యే అవకాశముంది. ఓవైపు బుద్దుడు, మరోవైపు తెలంగాణ సచివాలయం నడుమ ఆకాశమంత అంబేద్కర్‌ ను నిర్మించడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుత ఆలోచన విధానానికి , పరిపాలనాదక్షతకు నిదర్శనమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటికే ఆప్‌ తో పాటు- యుపి మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ డిప్యూటీ- సీఎం తేజస్వియాదవ్‌ లు కేసీఆర్‌ పోరాటం, కార్యక్రమాల పట్ల పూర్తి సానుకూలంగా, మద్దతుగా ఉన్నారు. బిఆర్‌ఎస్‌ ఆవిర్భావం, ఖమ్మం సభ, అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ, తెలంగాణ సచివాలయ ప్రారంభం, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అంశం, మహారాష్ట్ర సభ, చేరికలు అన్నీ.. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై ప్రత్యామ్నాయం కోరుకుంటు-న్న వారికి కేసీఆర్‌ దిక్సూచిగా కనిపిస్తున్నారు. కేసీఆర్‌ మోడల్‌ ను ఫాలో కావాలని తమతమ రాష్ట్రాల్ల్రో చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement