హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: రద్దయిన గ్రూప్-1 ప్రాథమిక పరీక్షతో పాటు- రద్దు, వాయిదా పడిన మిగతా పరీక్షలన్నింటినీ వచ్చే మూడు నెలల్లో జరిపేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీ-ఎస్‌పీ ఎస్‌సీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పరీక్షలు నిర్వహిం చాలన్న తొందరలో ఇప్పటికే జరిగిన తప్పులు, పొర పాట్లు- పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో, పకడ్బందీ వ్యూహంతో చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి కేసీఆర్ జారీ చేసిన ఆదేశాలపై సర్వీస్ కమిషన్ పాలకమండలి విస్తృత స్థాయిలో సమాలోచనలు జరు పుతున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతు న్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దు, వాయిదా వేసిన పరీక్షలు నిర్వహణకు సంబంధించి కమిషన్ కార్యాల యంలో సమావేశమైన చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యులు ఇతర అధి కారులు పరీక్షల షెడ్యూల్, తేదీల ఖరారు, ప్రశ్నపత్రాల కూర్పు, ఆన్‌లైన్ పద్ధతిన పరీక్షల నిర్వహణ, సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న నిజాలు తదితర అంశా లపై చర్చించినట్టు- సమాచారం.
సీఎం కేసీఆర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి కార్యదర్శి అనితా రామ చంద్రన్‌కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలను ఆమె సమా వేశంలో వివరించినట్టు- తెలుస్తోంది. పరీక్షలు జరపా లన్న తొందర ఏ మాత్రం మంచిది కాదని, లక్షల మం ది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పోటీ- పడు తున్న సమయంలో అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఏమరుపాటు- ఎంతమాత్రం పని కి రాదని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసు కున్న పాలకమండలి అన్ని అంశాలను చర్చించాకే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిద్దామన్న నిర్ణయానికి వచ్చి నట్టు- సమాచాచారం. వాస్తవానికి రద్దుచేసిన గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష(ప్రిలిమ్స్)ను జూన్ 11న నిర్వహిం చాలని కమిషన్ తొలుత భావించింది. చిన్న పరీక్షలను ముందు జరిపి ఆ తర్వాత ఈ పరీక్షను నిర్వహించే ఆలోచనతో కమిషన్ ఉన్నట్టు- సమాచారం. అయితే ఈ పరీక్షకు 2.86 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఇంత పెద్ద మొత్తంలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించాలంటే అందుకు అవసరమైన ఏర్పా ట్లు- చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం ఈ సమా వేశంలో వ్యక్తమైనట్టు- తెలుస్తోంది. ఇంతమందికి అవ సరమైన పరీక్షా కేంద్రాలను అన్వేషించాలని నిర్ణయిం చినట్టు- సమాచారం. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు- డివి జనల్ అకౌంట్స్ అధికారి(డీఏఓ), అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ), అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దు కాగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్శీస్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలను కమిషన్ వాయిదా వేసింది.
పరీక్షల విధానంలో మార్పు?
సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కొన్నిం టిని ఆప్టికల్ మార్క్ రీడర్(ఓఎంఆర్) పద్ధతిన జరి పింది. ఈ దఫా పాత విధానానికి స్వస్తి పలికి కంప్యూ టర్ ఆధారిత పరీక్షలను జరపాలని కమిషన్ ప్రతిపా దించినట్టు- సమాచారం. సాంకేతిక పరమైన ఈ మా ర్పుపై ఆయా రంగ నిపుణులతో చర్చించి తుది నిర్ణ యం తీసుకోవాలని కమిషన్ పాలకమండలి భావిసు ్తన్నట్టు- సమాచారం. కాగా కంప్యూటర్లను హ్యాక్ చేసి రహ ³స్య సమాచారాన్ని దొంగిలించకుండా ఉండేందు కు బ్లాక్ చైన్ -టె-క్నాలజీని అమలు చేసే అంశంపై కూడా సమాలోచనలు జరిపారు. అంతర్జాతీయంగా పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయాలు, నియామక సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయని, ఈ తరహా విధానంపై అధ్యయనం చే యాలని కూడా కమిషన్ ప్రతిపాదించిందని సమాచారం.