తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే డిసెంబరులో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని, ఆపై మార్చిలో ఎన్నికలొస్తాయని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో మన ఊరు-మన పోరు పేరిట కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుందనే సన్నాసులకు కొల్లాపూర్ సభే సమాధానం అని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో చేయని పనులన్నీ పూర్తి చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు. మరో 12నెలలు కష్టపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, ఆ వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు తిరుగుతానని, పార్టీని అధికారంలోకి తెస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబరులో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు: రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Advertisement
తాజా వార్తలు
Advertisement