Saturday, November 23, 2024

Breaking: కేసీఆర్‌కు, మోదీకి డైరెక్ట్ ఫోన్ లైన్​ ఉంది.. వాళ్లు వీళ్లు ఒక్కటే: రాహుల్ గాంధీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోదీ మ‌ధ్య డైరెక్ట్ ఫోన్ లైన్​ ఉంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) రాత్రి హైదరాబాద్ లో జ‌రిగిన భారత్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ని కాద‌ని, ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి కేసీఆర్‌ పనిచేస్తున్నారని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై మాట‌ల దాడికి దిగారు రాహుల్ గాంధీ.

‘‘పార్లమెంటులో బీజేపీ ఏదైనా బిల్లును తీసుకువచ్చినప్పుడల్లా, టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుంది. అందులో రైతుల‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలతో సహా” అని రాహుల్​ విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ, టీఆర్‌ఎ కలిసి పనిచేస్తాయి.. ఎలాంటి భ్రమలు పెట్టుకోవద్దు. ఎన్నికల ముందు మీ ముఖ్యమంత్రి డ్రామాలు ఆడతారు. కానీ, ఆయనకు నరేంద్ర మోదీకి డైరెక్ట్​గా లైన్‌ ఉంది’’ అని అన్నారు. 1990 అక్టోబర్‌లో అప్పటి ప్రధాని హత్యకు 7 నెలల ముందు.. తన తండ్రి, మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ‘సద్భావన యాత్ర’ ప్రారంభించిన హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో ఇవ్వాల రాహుల్​ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement