తెలంగాణలో కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కారు షాకిచ్చింది. ఆమెకు 15 రోజుల క్రితం ప్రభుత్వం కేటాయించిన 2 ప్లస్ 2 గన్మెన్లను ఉపసంహరించింది. దీనిపై షర్మిల అభిమానులు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ షర్మిల పలు జిల్లాలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల తన ప్రసంగాల్లో నిరుద్యోగుల తరుపున పోరాడుతానని, వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. దీంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన దీక్షకు కూడా షర్మిల మద్దతు పలికారు. కాగా ప్రభుత్వంపై షర్మిల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే కేసీఆర్ సర్కారు షర్మిల గన్మెన్లను ఉపసంహరించినట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కారు షాక్
By ramesh nalam
- Tags
- breaking news telugu
- important news
- Important News This Week
- Important News Today
- kcr government
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- security
- telangana
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
- YS sharmila
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement