Tuesday, November 26, 2024

Spl Story | తెలంగాణలో మళ్లీ కేసీఆర్​ సర్కారే.. రాసిపెట్టుకోండి, ఇదే నిజమైతది!

మీకు నమ్మకం లేకపోతే ఈ వివరాలను రాసిపెట్టుకోండి. 100కు 100శాతం ఇది నిజమైతది. ఇప్పటిదాకా మేమే చెప్పింది ఎక్కడా తప్పలేదు. ఎవరెన్ని మాటలన్నా, ఎన్ని డంబాచారాలు పలికినా.. తెలంగాణలో రాబోయేది కేసీఆర్​ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే. కేసీఆర్​ హ్యాట్రిక్​ కొట్టడం నూటికి నూరుశాతం నిజమైతది.. అంటున్నారు జ్యోతిష్య పండితులు.. ఇప్పటికే వారు చెప్పింది చెప్పినట్టు జరిగిందని కర్నాటక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణలో దశాబ్ది సంబురాలు జరుగుతున్న వేళ ఓ గుడ్​ న్యూస్​ చెప్పారు ప్రముఖ జ్యోతిష్యులు. రాబోయే జనరల్​ ఎలక్షన్స్​లో తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీ విజయకేతనం ఎగరేస్తుందని, మళ్లీ సీఎం కేసీఆర్​ నేతృత్వంలోని బీఆర్​ఎస్​ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్​ కొడుతుందని వెల్లడించారు. అయితే.. ఈ ఆస్ట్రాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెన్స్​ ఉందంటున్నారు నెటిజన్లు.. రుద్ర పర్​తాప్​ స్వామీజి చెప్పిన జోష్యాలన్నీ దాదాపు 100కు 100శాతం కరెక్ట్​గా జరుగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఈ మధ్య కర్నాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా చెబుతున్నారు.

https://twitter.com/Karanpartap01/status/1662460842049433602

రుద్ర పర్​తాప్​ స్వామిజీ మార్చి 30వ తేదీన కర్నాటక ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్​లో వివరాలు పోస్టు చేశారు. కర్నాటకలో సింగిల్​ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్​ పార్టీ విజయం సొంతం చేసుకుంటుందని తెలిపారు. ఆయన చెప్పినట్టే ఏప్రిల్​ 8వ తేదీన కూడా దీని గురించి మరో పోస్టు చేశారు. అయితే.. ఎన్నికల ఫలితాల రోజు స్వామీజి చెప్పిన జోస్యం నిజమైందని తేదీలతో సహా ట్విట్టర్​లో పోస్టుచేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మూడు పార్టీ మధ్య పోరు ఉండే చాన్సెస్​ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు.

- Advertisement -

రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి ప్రాధాన్యం ఉన్నది. కర్నాల‌క అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయన ముందుగానే కచ్చితమైన అంచనాను చెప్పారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. దీంతో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చేసిన జోస్యానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement