Wednesday, November 20, 2024

గులాబీ దళపతిగా కేసీఆర్.. 9వసారి అధ్యక్షుడిగా ఎన్నిక

టీఆ‌ర్‌‌ఎస్‌ పార్టీ అధ్య‌క్షు‌డిగా సీఎం కేసీఆర్ వరు‌సగా తొమ్మి‌దో‌సారి ఏక‌గ్రీ‌వంగా ఎన్నిక‌య్యారు. హైటెక్స్ లో జరిగిన టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అనంత‌రం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ మొత్తం 18 సెట్ల నామి‌నే‌షన్లు దాఖ‌లైన విష‌యం తెలిసిందే. పార్టీ‌లోని అన్ని విభా‌గాలు, అన్ని సామా‌జి‌క‌వ‌ర్గాల నేతలు కేసీ‌ఆర్‌ పేరును ప్రతి‌పా‌దిస్తూ నామి‌నే‌షన్లు దాఖ‌లు‌చే‌శారు. అధ్యక్ష పద‌వికి ఇత‌రు‌లె‌వ్వరూ నామి‌నే‌షన్లు దాఖ‌లు చే‌య‌క‌పో‌వ‌డంతో కేసీ‌ఆర్‌ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది.

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తి అవుతోంది. 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ అధ్యక్షతన 12 మంది ప్రతినిధులతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. పార్టీ అధ్య‌క్షు‌డిగా కేసీ‌ఆర్‌ ఇప్ప‌టి‌వ‌రకు వరు‌సగా ఎని‌మి‌ది‌సార్లు ఏక‌గ్రీ‌వంగా ఎన్ని‌క‌య్యారు. పార్టీ ఆవి‌ర్భావం తర్వాత ఇది 9వ సంస్థా‌గత ఎన్నిక. చివ‌రి‌సా‌రిగా 2017లో రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరి‌గింది. 2019లో పార్ల‌మెంట్‌ ఎన్ని‌కలు, 2020, 2021లో కరోనా కార‌ణంగా పార్టీ ప్లీనరీ నిర్వ‌హిం‌చ‌లేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. 2018 ముందస్తు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టారు. గడిచిన ఏడేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: వైసీపీ ఖాతాలో కాకినాడ మేయర్ పదవి.. కొత్త మేయర్ ఎవరంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement