హైదరాబాద్, : ఏజెన్సీ ప్రాంతంతో పాటు.. తెలం గాణ వ్యాప్తంగా ఆరు ఉమ్మడి జిల్లాల్లో గిరిజనులను కలవర పెడుతున్న పోడుసమస్యపై సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. సమస్యను తేల్చేసేందుకు వారం రోజుల్లో భద్రాద్రి జిల్లా పినపాక నియోజక వర్గానికి వెళ్ళాలని నిర్ణయించుకు న్నట్లు తెలిసింది. అడవిని నమ్ముకుని బతుకుతూ, అత్యంత వెనుకబడ్డ ఆదివాసీలు పోడుసమస్య, అటవీ అధికారుల దాడు లతో తీవ్ర అభద్రతాభావంతో భవిష్యత్తుపై భయంతో గజగజ లాడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇది అతిపెద్ద సమస్యగా రూపుదాల్చింది. ప్రత్యక్షంగానే కాకుండా.. పరోక్షంగా ఇది బాధిత గిరిజనులకు, అటు నాయకులకు కంటిమీద కునుకు ఉండనివ్వడం లేదు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్ ఈనెల 7న
తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీలో పోడు సమస్యను ప్రస్తావించి పరిష్కారానికి భరోసానిచ్చారు. ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. అటవీ అధికారులు ఇబ్బంది పెట్టకుండా స్టేటస్ కో ఇస్తామని చెప్పారు. బుధవారం నాగార్జునసాగర్ ధన్యవాద సభలోనూ.. ఈ అంశాన్ని ప్రస్తావించా రు. త్వరలోనే గిరిజన ప్రాంతాలు పర్యటించి.. అక్కడే కూర్చుని పోడు సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. పట్టాలిస్తనని భరోసానిచ్చారు. సాగర్ నుండి వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ పోడు సమస్యపై చర్చించి నట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కరించి, అక్కడికక్కడే పట్టాలు జారీచేసేందుకు తొలుత పినపాక నియోజకవర్గంలోనే పర్యటించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
పరిష్కారంపై సీరియస్
వార్డు మెంబర్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజాప్రతినిధుల మీద తీవ్ర ఒత్తిడి ఉంది. సమస్య తీవ్రత నేపథ్యంలో అనివార్య పరిస్థితులలో.. పార్టీ లను పక్కనబెట్టి ఎమ్మెల్యేలు కూడా పోడురైతుల పక్షం నిలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఊళ్ళకు ఊళ్ళు ఏకమవుతున్న వేళ పోడు సమస్య పరిష్కారం జరక్క, ఎమ్మెల్యేలు నిస్సహాయంగా చేతులెత్తేస్తున్నారు. అటు ప్రజల్లోకి వెళ్ళలేక, పరిష్కారం దొరక్క సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే.. పోడు అంశాన్ని ప్రాధాన్య అంశంగా ఎంచుకున్న కేసీఆర్ 20 నియోజకవర్గాల్లో ప్రభావవం తంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు పినపాకను వేదికగా ఎంచుకున్నట్లు తెలిసింది. ఆదివాసీ ఎమ్మెల్యే రేగా కాంతారావు క్షేత్రస్థాయి ఇబ్బందులను, గిరిజ నులు పడుతున్న ఇబ్బందులను.. అటవీ అధికారుల దాడులను ఎప్పటికపుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా.. సీఎం వెనుకబడ్డ, ప్రగతి వెలుగులు ప్రసరించని వర్గాలపై దృష్టిపెట్టారు. మొండిసమస్యలను కూడా అనేకం తెంచేసిన సీఎం.. ఇపుడు పోడు సమస్యను పరిష్కరించి గిరిజనుల జీవితాల్లో వెలుగులు, సం తోషం నింపేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వారంలోనే.. పినపాక నియో జకవర్గంలో పర్యటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించగా, ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పర్యటన ఉంటుందా.. లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెలలో వీలులేకుంటే.. మళ్లిd ఏప్రిల్ దాకా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అయితే ఇటు గిరిజనులకు, అటు ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా స్టేటస్ కో ఆదేశాలు.. ఇచ్చే అవకాశముంది. అధినేత పోడు అంశంపై దృష్టిపెట్టారన్న సమాచారం ఏజెన్సీ ప్రజాప్రతినిధుల్లో సంతోషం నింపుతుండగా, త్వరగా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు.
ఇక పోడు ‘పొడు’గించొద్దు..గోడు తీర్చేద్దాం..
Advertisement
తాజా వార్తలు
Advertisement