Friday, November 22, 2024

Breaking: ముంద‌స్తు ముచ్చటే లేదన్న కేసీఆర్​.. షెడ్యూల్​ ప్రకారమే ఎన్నిక‌లుంటయ్​!

ముంద‌స్తు ఎన్నిక‌ల ఊహాగానాల‌కు కేసీఆర్ తెర‌దించారు. ఈరోజు జ‌రిగిన రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే ఆగ‌స్టు-సెప్టెంబ‌ర్ లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావొచ్చ‌ని తెలిపారు. ప్ర‌జాప్ర‌తినిధులంద‌రూ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌ల‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని.. షెడ్యూల్ ప్రకారమే ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారాయన. ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలని.. ప్రతి ఎమ్మెల్యే పాదయాత్ర చేయాలని ఆదేశించారు.

ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని కోరారు కేసీఆర్. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కీలక నేతలకు సూచించారు. అదే విధంగా ఎమ్మెల్యేలు.. మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, సభలు నిర్వహించి ప్రజా సంక్షేమ పథకాలను జనానికి వివరించాలన్నారు కేసీఆర్. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు కేసీఆర్. ఆ రోజు ప్లీనరీ సమావేశం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని.. ఆ దిశగా ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement