Friday, November 22, 2024

రైలు ప్రమాదాల నివారణకు కవచ్‌.. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేటలో ట్రయల్‌ రన్‌ సక్సెస్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఇక ముందు అలాంటి ప్రమాదాలేవీ జరగవు. లోకో పైలట్‌? అప్రమత్తంగా లేకపోయినా, ట్రాక్‌ సరిగా లేకపోయినా, సాంకేతిక సమస్యలు తలెత్తినా ఇక భయపడనవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్యలకు పరిష్కారం ‘కవచ్‌’ రూపంలో దొరికింది. కవచ్‌ టెక్నాలజీపై ప్రయోగాత్మకంగా చేపట్టిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘కవచ్‌’ ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్‌’ భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా…. ప్రమాదం నివారించేలా కవచ్‌ వ్యవస్థను రూపొందించారు. రైల్వే మంత్రి స్వయంగా ఎదురెదురుగా వచ్చే రైళ్లలో ఒకదాంట్లో కూర్చొని కవచ్‌ పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఢిల్లీ, – మ్ఖుంబయి, ఢిల్లీ -హౌరా వంటి రద్దీ మార్గాల్లో 2వేల కిలోమీటర్ల మేర కవచ్‌ వ్యవస్థను విస్తరిస్తామని వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో ఇదొక మైలురాయని పేర్కొన్నారు. ఎదురెదురుగా రైళ్లు వచ్చిన సమయంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఏర్పాటు చేసిన లోకో మోటివ్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిస్టంను పరిశీలించారు. భారతీయ రైల్వేకు 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, దీంతో రైలు రవాణాలో విశ్వసనీయత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి విదేశాల్లో రూ. 2కోట్ల వరకూ ఖర్చయితే… దేశీయ సాంకేతికతో రూ. 50లక్షల్లోనే అభివద్ధి చేయగలిగామన్నారు. ప్రస్తుతం కవచ్‌ వ్యవస్థ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వాడి- వ్ఖికారాబాద్‌, సనత్‌నగర్‌ – వికారాబాద్‌, బీదర్‌ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్‌ చేస్తూ 264 కిమీల మేర అమలుచేస్తున్నామని వెల్లడించారు. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా కవచ్‌? టెక్నాలజీ ద్వారా అత్యంత సమీపానికి వచ్చి ఆగిపోతాయన్నారు. ఈ వ్యవస్థతో రైళ్లకు ఆటోమేటిక్‌?గా బ్రేకులు పడతాయని చెప్పారు. వంతెనలు, మలుపులు ఉన్నచోట పరిమితికి మించిన వేగంతో రైలు నడుపుతుంటే కవచ్‌లోని రక్షణ వ్యవస్థ స్పందిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement