Saturday, November 23, 2024

Crazy Love: క‌త్రినా అంటే పిచ్చి ప్రేమ‌.. త‌న‌కు ద‌క్క‌లేద‌న్న క‌సితో ఓ వీరాభిమాని ఏం చేశాడంటే!

బాలివుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ చాలామంది కుర్రాళ్ల‌కు క‌ల‌ల రాణిగా ఉండేది. ఆమె సినిమాలు అన్నా, ఆమె క‌నిపించిన ఏ వీడియో అయినా స‌రే క‌ల్లార్ప‌కుండా చూసేవారు. ఘాడంగా ప్రేమించేవారు. అంతేకాదండోయ్ త‌న అందాన్ని ఆరాధిస్తూ ఓ దేవ‌త‌లా కొలిచేవారు కూడా ఉన్నారు. అయితే ఒక‌త‌నికి మాత్రం కత్రినా అంటే య‌మ పిచ్చి. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌న్న కోరిక‌తో నిత్యం ర‌గిలిపోయేవాడు. అయితే.. గత ఏడాది క‌త్రినా, విక్కీ కౌశ‌ల్‌ని ల‌వ్ మ్యారేజీ చేసుకుంది.

దీంతో పిచ్చి పీక్స్‌కు చేరిన ఓ అభిమాని త‌న‌కు ద‌క్క‌ని క‌త్రినా కైఫ్‌ని ఖ‌తం చేస్తాన‌ని శ‌ప‌థం చేశాడు. సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అంతేకాకుండా క‌త్రినాతో క‌లిసి పెళ్లి చేసుకున్న‌ట్టు వీడియోల‌ను మార్పింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఇక అక్క‌డితో ఆగ‌కుండా క‌త్రినా, విక్కీ జంట‌ను బ‌త‌క‌నివ్వ‌ను, లేపేస్తాన‌ని తిరుగుతున్నాడు. దీన్ని కొంత‌కాలం లైట్ తీసుకున్న క‌త్రినా, విక్కీ కౌశ‌ల్ ఇప్పుడు అత‌ని విప‌రీత చేష్ట‌ల‌కు ఆందోళ‌న చెందుతున్నారు. నిజంగా అన్నంత ప‌నిచేసేలా ఉన్నాడ‌ని ఈ విష‌యాన్ని కాస్త పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, కంప్లెయింట్ కూడా రాసిచ్చారు.

అయితే. బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ను చంపేస్తాన‌ని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు ఇవ్వాల (సోమ‌వారం) అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మన్వీందర్‌ సింగ్‌ గా గుర్తించారు. ఇతను సినిమా రంగంలో చాన్స్ కోసం వెతుకుతున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. మన్వీందర్‌ సింగ్‌కు కత్రినా అంటే ఎంతో అభిమానం. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కన్నాడు. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లి పీటలెక్కడంతో అతని ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తాన‌ని సోషల్‌ మీడియా వేదికగా కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. ఈ బెదిరంపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు ముంబయ్‌లోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించారు.

దీనిని సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు.. సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద మన్వీందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఇన్‌స్టాగ్రామ్‌ అంతటా కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్‌ హీరోయిన్ల ఎడిటెడ్‌ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్‌ చేసి ఓ వీడియోను కూడా షేర్‌ చేశాడు. నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్‌- విశాల్‌ గతేడాది పెళ్లిపీటలెక్కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement