Monday, November 18, 2024

కాశీ యాత్రకి – ప్ర‌యోజ‌న‌క‌రంగా కాశీ ప్ర‌యాణ స‌బ్సిడీ ప‌థ‌కం

హిందూతీర్థ‌యాత్రికులకి స‌హాయం అందించ‌డానికి క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కాశీ యాత్ర పేరిత నూత‌న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. కాగా ఈ ప‌థ‌కాన్ని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రారంభించారు. దీని కోసం.. క‌ర్నాట‌క‌ రాష్ట్ర ప్ర‌భుత్వం తమ బడ్జెట్​లో రూ. 7 కోట్లను కేటాయించింది. ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయానికి తీర్థయాత్ర చేయడానికి సిద్దంగా ఉన్న 30వేల మంది యాత్రికులకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల నగదు సహాయం అందించనున్నట్టు సీఎం బొమ్మై పేర్కొన్నారు. మానస సరోవర యాత్రికులకు సహాయం అనే అకౌంట్స్ హెడ్‌ కింద ‘కాశీ యాత్ర’ కోసం మంజూరైన రూ. 7 కోట్లను వినియోగించుకునేందుకు మతపరమైన దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం తన ఉత్తర్వులో ఈ అధికారం ఇచ్చింది.
ఈ పథకం ద్వారా ప్రయోజనాలనుకునే వారు.. కర్నాటక నివాసి అయి ఉండి, కర్ణాటకలో నివాసం ఉన్నట్లు రుజువు కలిగి ఉండాలని, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లేదా రేషన్‌కార్డు తదితర వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.

కాగా, మతపరమైన దానం, హజ్, వక్ఫ్ మంత్రి శశికళ జోల్లె దీనికి సంబంధించి నేడు ఈ ప్రకటన జారీచేశారు. 2022-23 క‌ర్నాట‌క‌ రాష్ట్ర‌ బడ్జెట్‌లో కాశీ యాత్రకు రూ. 5,000 సబ్సిడీ అందించ‌నున్న‌ట్టు ఆ రాష్ట్ర‌ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. కాశీకి వెళ్లాలనుకునే, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారి కోసం కాశీ ప్రయాణ సబ్సిడీ పథకం ప్రయోజన‌క‌రంగా ఉంటుందని తెలిపారు.ఈ ప‌థ‌కం కింద్ర ఆప్లై చేసుకున్న దరఖాస్తుదారులు 18 ఏళ్లు నిండి ఉండాలి. వారు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తీర్థయాత్ర చేపట్టిన యాత్రికులకు ఈ ప్రయోజనం దక్కుతుంది. కాశీ యాత్ర ప‌థ‌కాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకునే వారు తమ దర్శన టిక్కెట్టు లేదా వెయిటింగ్ లిస్ట్, కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్లినట్లు ‘పూజ రశీదు’ వంటి రుజువులను సమర్పించాల్సి ఉంటుంది. ఆ రిసీప్ట్​ని తగిన ప్రొఫార్మాలో రిలీజియస్ ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కమిషనర్‌కు సమర్పించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement