తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ సరికొత్త వ్యాపారాన్ని పోలీసులు కనిపెట్టారు. కాంచీపురంలో జరుగుతున్న ఈ తంతుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో సడెన్గా అటాక్ చేశారు. పోలీసులు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి.
కాంచీపురంలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఇవ్వాల (మంగళవారం) రాత్రి పోలీసులు జరిపిన దాడుల్లో వెలుగుచూసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా ప్యాకేజీ, దానికి సంబంధించిన బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఈ ప్యాకేజీలో 15 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మసాజ్ సెంటర్లోని వీడియోలు కొన్ని బయటకు రావడంతో వీరి సీక్రెట్ యవ్వారాలన్నీ బయటపడ్డాయి. ఇక.. పోలీసుల తనిఖీల్లో చాలామంది యువతులు పట్టుబడ్డట్టు తెలుస్తోంది. వీరిపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.