Wednesday, November 20, 2024

Karntaka – సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి చేత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఇక, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో జి పరమేశ్వర (ఎస్సీ), కేహెచ్ మునియప్ప(ఎస్సీ), కేజే జార్జ్(మైనారిటీ-క్రిస్టియన్), ఎంబీ పాటిల్(లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్‌టీ-వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ- కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు), రామలింగా రెడ్డి (రెడ్డి), బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్(మైనారిటీ-ముస్లిం) ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement