సీఎం బసవరాజ్ బొమ్మై సారథ్యంలో కర్ణాటక త్వరితగతిని అభివృద్ధి చెందుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ)కి చెందిన ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ (ఎఫ్‌సిఎస్) కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం బొమ్మై, సమర్థత ..నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి అని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. కేవలం 45 రోజుల్లోనే ఎఫ్‌సిఎస్‌ను ఏర్పాటు చేయడంలో బొమ్మై చేసిన సహకారాన్ని రక్షణ మంత్రి ప్రశంసించారు. కర్ణాటక, ప్రత్యేకించి రాజధాని బెంగళూరుకు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రం పెద్ద మర్రి చెట్టును పోలి ఉంటుంది. అది విస్తరించే కొద్దీ దాని మూలాలు మరింత లోతుగా మారి, వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుతోందన్నారు. DRDO .. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) కేవలం 45 రోజులలో FCS కాంప్లెక్స్‌ను పూర్తి చేసినందుకు ప్రశంసించారు, ఇది ఒక అద్భుతం అని కొనియాడారు.
‘ఎఫ్ సిఎస్’ కాంప్లెక్స్ ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ – సీఎం బసవరాజ్ బొమ్మై పై ప్రశంసలు
Advertisement
తాజా వార్తలు
Advertisement