Saturday, November 23, 2024

క‌ర్ణాట‌క‌లో 31ఒమిక్రాన్ కేసులు

ఒమిక్రాన్ ప‌లు దేశాల‌తో పాటు ఇండియాలో కూడా బాగా వ్యాపిస్తుంది. ఈ మేర‌కు క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ‌ హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో కొత్త‌గా 12ఒమిక్రాన్ కేసులు న‌మోద‌యిన‌ట్లు తెలిపింది. దాంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 31కి చేరాయి. కాగా బెంగ‌ళూరులో అధిక కేసులు న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో కరోనా మహమ్మారి, ఒమి క్రాన్ కట్టడి పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలకు తాజాగా కేంద్రం సూచనలు చేసింది. కరోనా కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా, ఒమీ క్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఎక్కువ కేసులు ఉన్న కొవిడ్ క్లస్టర్ లను పర్యవేక్షించాలని.. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement