Thursday, November 14, 2024

Karnataka – ప్ర‌భుత్వ అధికారుల ఇళ్ళ‌ల్లో – దిమ్మ‌తిరిగే స్థాయిలో కోట్ల విలువైన ఆస్తులు

క‌ర్ణాట‌క వ్యాప్తంగా 75ప్ర‌దేశాల్లో ఏసీబీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఇందులో 18 మంది ప్రభుత్వ అధికారుల నివాసాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ లో అవినీతి తిమింగలాలను పట్టుకునేందుకు 100 మందికి పైగా అధికారులు.. 300 మందికి పైగా వివిధ సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ రెయిడ్స్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏసీబీ సోదాలు నిర్వహించిన వారిలో.. అదనపు కమిషనర్లు, ఇంజినీర్లు, అటవీ శాఖ అధికారులు, మేనేజర్ స్థాయి అధికారులు సైతం ఉన్నారు. కర్ణాటక ఏసీబీ చేపట్టిన ఈ సోదాల్లో.. లెక్కలో చూపని నగదు, బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, ఖరీదైన గృహసామగ్రి, ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు.

పెద్ద ఎత్తున భూమి పత్రాలు, వాణిజ్య సముదాయాలు, వ్యవసాయ భూముల ఆస్తి పత్రాలను వారు సోదాల్లో గుర్తించారు. ఇంకా విలాసవంతమైన హోమ్ థియేటర్లు, బ్యాడ్మింటన్ కోర్టులు సైతం గుర్తించినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. వాటన్నిటినీ చూసిన అధికారులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఇంత భారీ స్థాయిలో ప్రభుత్వ అధికారుల నివాసాల్లో సోదాలు జరపటం ఒక సంచలనం కాగా.. అక్కడ దొరికిన అక్రమ ఆస్తుల విలువ చూసి అందరూ అవాక్కవుతున్నారు. కర్ణాటక బాగల్​కోటె జిల్లాలోని బదామీ అటవీ రేంజ్ అధికారికి చెందిన ప్రదేశాలను సోదా చేయగా.. 3 కిలోల గంధపు చెక్కలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘కృష్ణ భాగ్య జలనిగమ్ లిమిటెడ్’ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అశోక్ రెడ్డి పాటిల్ ఇంట్లో రూ.7 లక్షల నగదు, భారీగా బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. మైసూర్ విజయనగర్ పోలీస్ స్టేషన్​ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, చామరాజనగర్ ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్ చెలువురాజ నివాసాల్లో విలువైన పత్రాలు దొరికాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement