కర్నాటకలో లౌడ్ స్పీకర్ల అంశం వేడి పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జరీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను నిషేధించింది. కమ్యూనిటీ హాల్స్, కాన్ఫరెన్స్ గదులు, ఆడిటోరియంలు, మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్ప ఇతర బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో శబ్ద తీవ్రత 10 డెసిబుల్స్ కి మించరాదనే సుప్రీంకోర్టు నిబంధనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ సర్క్యులర్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇప్పటికే లౌడ్ స్పీకర్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సౌండ్-ప్రొడ్యూసింగ్ పరికరాలను ఉపయోగించే వినియోగదారులందరూ 15 రోజుల్లోగా అనుమతి పొందాలని పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement