రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్‌కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయంటూ దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కేరళతో సరిహద్దులో ఉన్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలను అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ జలియన్ వాలాబాగ్.. అక్కడేం జరిగింది?