డ్యాన్స్ మాస్టర్ ని మించేలా స్టెప్పులతో అదరగొట్టారు ఓ కలెక్టర్. స్టేజ్ పైన ఫుల్ ఎనర్జిటిక్ తో డ్యాన్స్ చేశారు. హెచ్డిఎంసి ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు కలెక్టర్ గోపాలకృష్ణ. ఆ కార్యక్రమం లో భాగంగా కన్నడ సాంగ్ కు డ్యాన్స్ వేశారు.కలెక్టర్ డ్యాన్స్ ను చూసిన విద్యార్థులు, అధికారులు, స్థానికులు అందరూ ఫుల్ ఫిదా అయ్యారు. కలెక్టర్ స్టేజీపై డ్యాన్స్ చేస్తుండగా అందరూ కేరింతలు కొట్టారు.
ఆయన ఉత్సాహాన్నిచూసి అందరూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. హుబ్బళ్లి- ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి. గోపాల్ కృష్ణ ఇటీవల ధార్వాడలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు..తనకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని గతంలో చాలాసార్లు చెప్పారు.. ఇప్పుడు ఆయన వేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..కలెక్టర్ అంటే ఆ మాత్రం ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.