మేకేదాటు రిజర్వాయర్ కోసం కావాల్సిన అన్ని చర్యలను చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడవద్దని, గుంపులుగా చేరొద్దని గురువారం కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.
‘‘మేకేదాటు రిజర్వాయర్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని అమలు కోసం అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ, కరోనా థర్డ్ వేవ్ సమయంలో జనాన్ని గుంపులుగా పోగు చేసి పాదయాత్ర చేపట్టాలనుకోవడం అంత మంచిది కాదు. కోర్టు కూడా పరిస్థితిని పరిశీలించింది. పాదయాత్రను విరమించుకుని భవిష్యత్తులో తమతో కలిసి రావాలని కోరుతున్నా’’.. అని ముఖ్యమంత్రి బొమ్మై కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..